మార్కెట్లోకి రెనో సరికొత్త క్విడ్‌

ABN , First Publish Date - 2020-07-07T06:44:36+05:30 IST

ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ క్విడ్‌లో సరికొత్త ఆర్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ను రెనో విడుదల చేసింది. బీఎస్‌-6 ఇంజన్‌తో కూడిన కొత్త వేరియంట్‌ను ఎంటీ, ఏఎంటీ వెర్షన్లలో తీసుకువచ్చినట్లు పేర్కొంది...

మార్కెట్లోకి రెనో సరికొత్త క్విడ్‌

  • ధర రూ.4.16-4.48 లక్షలు 

ముంబై: ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ క్విడ్‌లో సరికొత్త ఆర్‌ఎక్స్‌ఎల్‌ వేరియంట్‌ను రెనో విడుదల చేసింది. బీఎస్‌-6 ఇంజన్‌తో కూడిన కొత్త వేరియంట్‌ను ఎంటీ, ఏఎంటీ వెర్షన్లలో తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ కారు ధరలు వరుసగా రూ.4.16 లక్షలు, రూ.4.48 లక్షలుగా ఉన్నాయి. కాగా భారత మార్కెట్లో క్విడ్‌కు అద్భుతమైన లభిస్తోందని, ఇప్పటికే  విక్రయాలు 3.5 లక్షల యూనిట్లు అధిగమించాయని  రెనో ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి వెల్లడించారు. సరికొత్త క్విడ్‌ కోసం ఈ ఆధారిత ‘బై నౌ పే లాటర్‌’ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు రెనో తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ లేదా కంపెనీ డీలర్‌షిప్‌  వద్ద ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. క్యాష్‌ ఆఫర్స్‌, ఎక్స్ఛేంజ్‌ బెనిఫిట్స్‌తో పాటు 8.25 శాతం వడ్డీతో కారు కొనుగోలుకు ఫైనాన్స్‌ సదుపాయాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది. 


Updated Date - 2020-07-07T06:44:36+05:30 IST