కార్పొరేట్ల కోసమే కొత్త చట్టాలు: చాడ

ABN , First Publish Date - 2021-01-17T09:53:31+05:30 IST

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టాలు: చాడ

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టాలు: చాడ

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టేందుకే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాజ్‌బహదూర్‌గౌర్‌ హాల్‌లో శనివారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు వారాల తరబడి ఉద్యమాలు చేస్తుంటే కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేయడం గర్హనీయమన్నారు. 

Updated Date - 2021-01-17T09:53:31+05:30 IST