అభివృద్ధికి కొత్తరూపు.. పువ్వాడ నగర్‌

ABN , First Publish Date - 2021-07-26T05:39:44+05:30 IST

: పువ్వాడ ఉదయ్‌కుమార్‌ నగర్‌ నూతనంగా ఏర్పడిన కాలనీ. అక్కడి ప్రజాప్రతినిధుల ముందుచూపుతో అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలను వినియోగిం చుకుంటూ గ్రామాన్ని అభివృద్దిపథంలో నడిపిస్తున్నారు.

అభివృద్ధికి కొత్తరూపు.. పువ్వాడ నగర్‌
పచ్చని తోరణంలా పువ్వాడనగర్‌ ప్రధాన రహదారి

 పచ్చలతోరణంలా రహదారులు

మంత్రుల అభినందనలు

రఘునాథపాలెం, జూలై25: పువ్వాడ ఉదయ్‌కుమార్‌ నగర్‌ నూతనంగా ఏర్పడిన కాలనీ. అక్కడి ప్రజాప్రతినిధుల ముందుచూపుతో అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలను వినియోగిం చుకుంటూ గ్రామాన్ని అభివృద్దిపథంలో నడిపిస్తున్నారు. కాలువకట్ట, తదితర ప్రాంతాల్లో కొందరు పేదలు నివాసాలు కోల్పోయారు. వారి కోసం ఇంటిస్థలాల కోసం దివంగత సీపీఐ నాయకుడు పువ్వాడ ఉదయ్‌కుమార్‌ పోరాడారు. దీంతో అప్పటి ప్రభుత్వం వారికి ఇంటి స్థలాలను అందించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పట్ణణంలోలా ఉండే అపార్ట్‌మెంట్‌ల మాదిరిగా ఈ గ్రామం కళకళలాడుతోంది. దీంతో ఈ గ్రామానికి పువ్వాడ ఉదయ్‌కుమార్‌ నగర్‌గా నామకరణం చేసుకున్నారు. ఆయన తమ్ముడు ప్రస్తుత రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో అనేక అభివృద్ది కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నారు. ప్రధాన రహదారి అంతా పచ్చల తోరణాన్ని తలపిస్తోంది. పల్లెప్రకృతివనం, వైకుంఠదామం, డంపింగ్‌ యార్డు తదితర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టటంలో సర్పంచ్‌ కాంపాటి లలిత ముందువరసలో నిలుస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి ఇక్కడ అభివృద్దిని పరిశీలించారు. సర్పంచ్‌ లలితను, టీఆర్‌ఎస్‌ నాయకుడు కాంపాటి రవిను అభినందించారు. 

మంత్రి పువ్వాడ అజయ్‌ చొరవతోనే: కాంపాటి లలిత సర్పంచ్‌

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతోనే  అభివృద్ధి సాధ్యమైంది. కొత్తగా ఈకాలనీ ఏర్పడటం తో మరిన్ని నిధు లు అవసరం ఉంది. అయినప్పటికి మంత్రి పువ్వాడ సహకారం అందిస్తున్నారు. ఈ గ్రామాన్ని  సీసీ రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని సాధిస్తాం.

Updated Date - 2021-07-26T05:39:44+05:30 IST