తప్పులతడకగా ప్రశ్నలు

ABN , First Publish Date - 2021-10-22T06:18:52+05:30 IST

ఫార్మెటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షలు విమర్శలపాలయ్యాయి. ప్రశ్నపత్రంలోనే తప్పులొచ్చాయి.

తప్పులతడకగా ప్రశ్నలు
10వ తరగతి గణితంలో రిపీటైన క్వశ్చన్లు

కొత్త విధానం.. సరికొత్త సమస్యలు..!

ఒకే ప్రశ్న మళ్లీ.. మళ్లీ..

10 గణితం పేపర్‌లోక్వశ్చన్‌ రిపీట్‌

9లోనూ తప్పులు

ఉదయం 7 గంటలకే సోషల్‌ మీడియాలో పేపర్లు

పారదర్శకతకు పాతర

బోర్డుపై రాసిన టీచర్లు

రాసుకోలోని స్థితిలో ప్రైమరీ విద్యార్థులు

ఆఖరికి జిరాక్స్‌ కాపీలు తీయించి ఇచ్చిన వైనం

ఎఫ్‌ఏ పరీక్షల తీరు ఇదీ..

అనంతపురం విద్య, అక్టోబరు 21: ఫార్మెటివ్‌ అసె్‌సమెంట్‌ (ఎఫ్‌ఏ) పరీక్షలు విమర్శలపాలయ్యాయి. ప్రశ్నపత్రంలోనే తప్పులొచ్చాయి. ఇచ్చిన ప్రశ్నలే తప్పు. అంతేనా.. ఒకే ప్రశ్న రెండుసార్లు అడిగారు. ఎఫ్‌ఏ పరీక్షలు అందరికీ అవస్థలు సృష్టించాయి. పారదర్శకత అంటూ తీసుకొచ్చిన నూతన విధానంలో ప్రశ్నపత్రాలు ఉదయాన్నే పరీక్షలకు ముందే సోషల్‌ మీడియాలో బయటపడ్డాయి. అంతేనా.. ప్రశ్నపత్రాల్లో తప్పులు, ప్రశ్నల పునరావృతాలు కనిపించాయి. వాట్సాప్‌ ప్రశ్నపత్రాన్ని బోర్డుపై టీచర్లు రాయగా.. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వాటిని రాసుకోలేకపోయా రు. చేసేదిలేక జిరాక్సు కాపీలు చేయించి, ఇవ్వాల్సి వచ్చిందని టీచర్లు వాపోతున్నారు. హడావుడిగా ఇచ్చిన ప్రశ్నపత్రాల్లో కొన్ని క్వశ్చన్లు డబుల్‌ ఇచ్చారు. రిపీట్‌ అయ్యాయి. 10వ తరగతి గణితం పేపర్‌లో ఒక్కటే క్వశ్చన్‌ రెండుసార్లు ఇచ్చారు. 9వ తరగతి ప్రశ్నపత్రంలో తప్పులు ఇచ్చారు. సం స్కరణ, పారదర్శకత అంటూ రాష్ట విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) తీసుకున్న ఎఫ్‌ఏ పరీక్షల కోసం వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం అందించే నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయి. గురువారం ఎఫ్‌ఏ-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిర్ధేశిత సమయానికి నిర్వహించలేకపోయారు. పరీక్ష సమయం ఒక గంట అయితే... రెండు, మూడు గంటలపాటు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం... సరికొత్త సమస్యలను తీసుకొచ్చింది. 1, 2, 3 తరగతుల విద్యార్థులు చాలామంది బ్లాక్‌ బోర్డుపై రాసిన వాటిని చూసి, రాసుకోలేరన్న ఉద్దేశంతో... టీచర్లు ఆఖరికి ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ చేయించి ఇచ్చా రు. ఇది పరోక్షంగా ప్రశ్నపత్రం కొని తెచ్చిపెట్టినట్టే అయింది. ముఖ్యంగా గ్రూప్స్‌, సివిల్స్‌ తరహాలో భ ద్రత పాటిస్తామంటూ అరగంట ముందు వాట్సాప్‌ చేస్తామన్న ప్రశ్నపత్రాలు ఉదయం 7 గంటల నుంచే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ మాత్రం దానికి ఇంత రాద్దాంతం అవసర మా అంటూ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు.. ఎస్‌సీఈఆర్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



ప్రశ్నపత్రాల్లో విచిత్రాలు..!

ఎఫ్‌ఏ పరీక్షల ప్రశ్నపత్రాలు హడావుడిగా రూపొందించారన్న విమర్శలు వస్తున్నాయి. 10వ తరగతి గణితశాస్త్రం ఇంగ్లీష్‌ మీడియం ప్రశ్నపత్రంలో క్వశ్చన్‌ రిపీట్‌ చేశారు. 4వ, 6వ ప్రశ్న రెండుసార్లు ఇ చ్చారు. 9వ తరగతి గణితశాస్త్రంలోని తెలుగుమీడియం ప్రశ్నపత్రంలో బహుళైౖచ్చిక ప్రశ్నల్లో మొదటి ప్రశ్నలో తప్పులు ఇచ్చారు. 1--------దశాంశ విలువ గుర్తించమని ఇచ్చారు. భిన్నము ఇవ్వలేదు. ఇంగ్లీష్‌ మీడియం ప్రశ్నపత్రంలో 1/2నకు దశా ంశం రాయండి అని ఇచ్చారు. ఇలా తప్పు లు, రిపీట్‌ ప్రశ్నలు ఇచ్చారు. ఎస్‌సీఈఆర్టీ తీరుపై టీచర్లు అసహం వ్యక్తం చేస్తున్నా రు. కేవలం 20 మార్కుల ప్రశ్నపత్రంలో తప్పులు, డబుల్‌ ఎంట్రీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







పిల్లలకు పాట్లు...

ఎఫ్‌ఏ పరీక్షలు తొలి రోజు గందరగోళంగా, హడావుడిగా సాగాయి. తొలిరోజు ప్రైమరీలో తెలుగు పరీక్షలు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, ఉన్నత స్థాయిలో ఉదయం 10 నుంచి 11 వరకూ తెలుగు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకూ గణితం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే తయారు చేసేవారు. తాజాగా ఎస్‌సీఈఆర్టీ వాట్సాప్‌ ద్వారా పేపర్లు పంపారు. ఉదయం 7 గంటలకే సోషల్‌ మీడియాలో పేపర్లు హల్‌చల్‌ చేశాయి. ప్రభుత్వం కానీ, ఎస్‌సీఈఆర్టీ కానీ తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదన్న వాదనలు వినిపించాయి. వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాలను చూసి టీచర్లు బ్లాక్‌ బోర్డుపై రాస్తే... వాటిని చాలామంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రాసుకోలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో జిల్లావ్యాప్తంగా వందలాది స్కూళ్లలో టీచర్లు జిరాక్స్‌ కాపీలు తీయించి, పిల్లలకు ఇచ్చారు.

Updated Date - 2021-10-22T06:18:52+05:30 IST