వైవీని కలిసిన నూతన ప్రజాప్రతినిధులు

Sep 28 2021 @ 00:31AM
వైవీని సన్మానిస్తున్న నేతలు

తాళ్లూరు, సెప్టెంబర్‌ 27 : నూతనంగా ఎన్నికైన తాళ్లూరు మండల ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డిని తాడేపల్లిలో సోమవారం సాయంత్రం  కలిసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లూరు మండలానికి చెందిన దర్శి ఎఎంసీ చైర్మన్‌  ఐ.వేణుగోపాల్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీను, మండల ఉపాద్యక్షులు ఐ.వెంకటేశ్వరరెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ కరిముల్లా, వైసీపీ నేత జి.యల్లమందారెడ్డిలు వైవీని మర్యాదపూర్వకంగా కలిశారు. పదవులకు వన్నె తేచ్చేవిధంగా మండల అభివృద్ధికి కృషి చేస్తామని విన్నవించారు. వైవీని ఏఎంసీ మాజీ చైర్మన్‌ వైవీ భద్రారెడ్డి గజమాలతో దుశ్శాలువా ఘనంగా సత్కరించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.