కొత్త సారూ! పాత కేసులు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-05-24T06:03:59+05:30 IST

పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన తమ్మి శెట్టి మధు ముందు అనేక పెండింగ్‌ కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి.

కొత్త సారూ! పాత కేసులు పరిష్కరించండి
పట్టణ పోలీస్‌ స్టేషన

పెండింగ్‌లో హత్య కేసులు 

దొరకని దొంగలు

నిద్రపోతున్న నిఘానేత్రం

అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌ 

కదిరి, మే 23: పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన తమ్మి శెట్టి మధు ముందు అనేక పెండింగ్‌ కేసులు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. దీర్ఘకాలికం గా రెండు హత్యకేసుల్లో నిందితులను అరెస్టు చేయ లేదు. పలు చోరీల్లో నిందితులను గతంలో ఉన్న పోలీ సులు పట్టుకోలేక పోయారు. పట్టణంలో పోలీసులకు అత్యంత సహాయకరంగా ఉండే సీసీ కెమెరాలు సరిగా పనిచేయడంలేదు. అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌ ప్రజలను ఇబ్బందులు పెడుతోం ది. ఈ సమస్యలన్నీ కొత్తసారు పరిష్కరిస్తారని, సామాన్యులు సైతం తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశముంటుందని  ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు... వచ్చిన అధికారి ప్రజా సమస్యలు పరి ష్కరిస్తారా, లేక అధికార పార్టీకి అండగా ఉంటారా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

పెండింగ్‌లో హత్య కేసులు: పట్టణంలో సంచలనం రేపిన రెండు హత్యకేసుల్లో ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు. ఈ రెండు హత్య కేసుల్లో ఇద్దరు పట్టణ సీఐలు వివిధ ఆరోపణలు ఎదుర్కొని వీఆర్‌ కు వెళ్లారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారి కరణ్‌ స్థానిక ఎంజీ రోడ్డులో హత్య చేయబడ్డారు. ఆహత్యకేసులో నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈహత్యకేసును విచారణ చేసిన సీఐ శ్రీనివాసులు వివిధ ఆరోపణలు ఎదుర్కొని వీఆర్‌కు వెళ్లారు,  నేటికి ఈహత్య కేసు ప్రశ్నార్థకంగానే మారింది. అలాగే ఈసంవత్సరం మార్చిలో కిరణా వ్యాపారి ప్రమీలను హత్య చేశారు. ఈ కేసులోనూ ఇంతవరకు నిందితులు ఎవరో గుర్తించలేదు.  ఈకేసును విచారించిన సీఐ సత్యబాబుకూడా వీఆర్‌కు వెళ్లారు. ఈ కేసులను ఛేదించే బాధ్యత ప్రస్తు తం టౌన సీఐగా బాధ్యతలు తీసుకున్న మధుపై పడింది. అదేవిధంగా పట్టణంలో పలు దొంగతనాలు జరిగాయి. ముఖ్యంగా బ్యాంక్‌ వద్ద స్కూటీ లో రూ.3లక్షలు దోచుకెళ్లారు. బంగారు చైన లాక్కెళ్లారు. అదేవిధంగా బస్టాండ్‌లో బంగారు కాజేసిన కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 

నిఘా నేత్రం నిద్రపోతోంది: వివిధకేసుల్లో పోలీసులకు  సాంకేతికం గా ఉపయోగపడేది మొదట సెల్‌ఫోన కాల్‌డేటా కాగా రెండోది సీసీ కెమెరాలే. ప్రస్తుతం పట్టణంలోని సీసీ కేమెరాలు అక్కడక్కడ మాత్రమే పనిచేస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇవి పనిచేసే దిశగా కొత్త సీఐ చర్యలు చేపడుతారని ప్రజలు భావిస్తున్నారు. 

అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌: 

పట్టణంలో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంది. ము ఖ్యంగా వేమారెడ్డి సర్కిల్‌, ఇక్బాల్‌రోడ్డు, జీవిమాన సర్కిల్‌, హిందూపురం క్రాస్‌లో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. వేమారెడ్డి సర్కిల్‌లో మూడు రహదారులు కలుస్తుండడం వలన గందరగోళంగా ఉంటుంది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. వీటిని నివారించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవా ల్సి ఉంది. ఇక్బాల్‌రోడ్డు నిత్యం ట్రాఫిక్‌తో ఇటు ప్రజలు, అటు వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటారు. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తారని కొత్త సీఐపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

అందరివాడా... కొందరివాడా: వృత్తిపరంగా వివిధ కేసులు ఛేదించ డంలో భారత ప్రభుత్వం అవార్డును సైతం అందుకున్న సీఐ మధు, అధికార పక్షానికి అండగా ఉంటారని ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ లాడ్జి వ్యవహారంలో నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని ఆరోప ణలు నడుస్తున్నాయి. ఈవ్యవహరం జరిగిన తీరుపై బాధితుడు రాష్ట్ర మానవహక్కుల కమిషనకు విన్నవించుకోగా, దీనిపై సంజాయిషి ఇవ్వాలని సీఐని ఎస్‌హెచఆర్‌సీ ఆదేశించింది. ఇటువంటివి చూసినప్పుడు సీఐ అందరివాడా లేక కొందరివాడా అన్నది వేచ్చి చూడాల్సి ఉంది. 

ప్రత్యేక దృష్టి.. - మధు, పట్టణ సీఐ

పెండింగ్‌ హత్య కేసులు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తా. ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటా. వీఽధుల్లో ఆక్రమణలుంటే మున్సిపాలిటీ సహకారంతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటా.


Updated Date - 2022-05-24T06:03:59+05:30 IST