Monkey pox: బ్రిటన్‌లో బయటపడ్డ మంకీపాక్స్ కొత్త స్ట్రెయిన్

ABN , First Publish Date - 2022-09-03T04:54:20+05:30 IST

బ్రిటన్‌లో(Britain) తాజాగా ఓ కొత్తరకం మంకీపాక్స్ స్ట్రేయిన్(Monkey pox strain) బయటపడింది.

Monkey pox:  బ్రిటన్‌లో బయటపడ్డ మంకీపాక్స్ కొత్త స్ట్రెయిన్

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో(Britain) తాజాగా ఓ కొత్తరకం మంకీపాక్స్ స్ట్రేయిన్(Monkeypox strain) బయటపడింది. వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లొచ్చిన ఓ పర్యాటకుడిలో దీన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్న స్ట్రేయిన్‌ను ఈ కేసులో కనిపించలేదని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించింది. ఈ కొత్త స్ట్రెయిన్ బారిన పడ్డ రోగి ప్రస్తుతం రాయల్ లివర్‌పూల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోగికి సమీపంలోకి వచ్చిన వారందరి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ స్ట్రేయిన్‌కు సంబంధించి ఇతర కొత్త కేసులేవీ ఇప్పటివరకూ బయటపడలేదని చెప్పారు. స్వలింగ సంపర్కకులు, బైసెక్సువల్ పురుషులు అధికంగా ఈ వ్యాధి బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-09-03T04:54:20+05:30 IST