ట్విట్టర్‌లో కొత్త హంగులు

ABN , First Publish Date - 2021-05-08T05:48:57+05:30 IST

వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు అందించేందుకు ట్విట్టర్‌ కృషిచేస్తోంది. ఇటీవలే 4కె క్వాలిటీ ఇమేజ్‌లను జతచేసింది.

ట్విట్టర్‌లో కొత్త హంగులు

వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు అందించేందుకు ట్విట్టర్‌ కృషిచేస్తోంది. ఇటీవలే 4కె క్వాలిటీ ఇమేజ్‌లను జతచేసింది. తాజాగా క్రాప్‌ చేసిన ఫోటోలకు బదులుగా ఫుల్‌సైజ్‌లో వాటిని ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘నో బర్డ్‌ టూ టాల్‌, నో క్రాప్‌ టూ షార్ట్‌’ అంటూ ట్విట్టర్‌ ఒక మెసేజ్‌లో తెలిపింది. 16.9 ఫార్మాట్‌లో వినియోగానికి ఇంతకు మునుపు ఇమేజ్‌ని తగ్గించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదన్నమాట.


అంతేకాకుండా హానికరం, అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే దాన్ని గుర్తించే వ్యవస్థను ట్విట్టర్‌ అభివృద్ధిపర్చింది. గత మే నుంచి టెస్టింగ్‌లో ఇది ఉంది. ఎంపిక చేసిన కొన్ని ఐఓఎస్‌ల్లో మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఇప్పుడు దాన్ని ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లు అన్నింటికీ వర్తింపజేస్తోంది. అలాగే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి దీన్ని మరింత మెరుగుపరుస్తామని అధికారిక పోస్టులో ట్విట్టర్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-05-08T05:48:57+05:30 IST