వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక నుంచి రివ్యూ చేసుకున్నాకే పంపొచ్చు

ABN , First Publish Date - 2021-12-16T02:09:29+05:30 IST

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టెక్నో రంగంలో ముందుండే వాట్సాప్.. తాజా మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న వాయిస్ రికార్డ్ ఆప్షన్‌లో మన వాయిస్ రికార్డ్ చేసి అవతలి వారికి పంపవచ్చు. వాయిస్ రికార్డ్ చేస్తున్న సమయంలో తడబాటు, మధ్యలో ఏదైనా పొరపాటు సమాచారం..

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక నుంచి రివ్యూ చేసుకున్నాకే పంపొచ్చు

న్యూఢిల్లీ: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టెక్నో రంగంలో ముందుండే వాట్సాప్.. తాజా మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న వాయిస్ రికార్డ్ ఆప్షన్‌లో మన వాయిస్ రికార్డ్ చేసి అవతలి వారికి పంపవచ్చు. వాయిస్ రికార్డ్ చేస్తున్న సమయంలో తడబాటు, మధ్యలో ఏదైనా పొరపాటు సమాచారం ఇవ్వడం, లేదంటే అనుకున్నంత నీట్‌గా ఇవ్వక పోవడం లాంటివి సహజంగానే జరుగుతాయి. రికార్డ్ వదిలేయగానే అవతలి వారికి సెండ్ అవ్వడం వల్ల.. ఎలా రికార్డ్ అయిందో చూసుకోకుండా అవతలి వారికి వెళ్లిపోతుంది. అయితే ఈ సమస్యకు వాట్సాప్ పరిష్కారం కనిపెట్టింది. ఇక నుంచి వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసి ఆ తరువాత సెండ్ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చారు. ఈ విషయాన్ని వాట్సాప్ మంగళవారం అర్థరాత్రి ప్రకటించింది. ‘‘వాయిస్ రికార్డ్స్ అనేవి చాలా మందికి ఎంతో ముఖ్యమైనవి. చాట్ చేయడానికి ఇబ్బంది పడేవారు, ఇష్టంలేని వారు వాయిస్ మెసేజ్ ద్వారా తమ సందేశాల్ని పంపిస్తారు. అంతే కాకుండా వాయిస్ నోట్‌లో తమ భావోద్వేగాల్ని కూడా సులభంగా పంపగలరు. కాగా, ఇప్పటి వరకు రివ్యూ ఆప్షన్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ సమస్య తలెత్తదు’’ అని వాట్సాప్ పేర్కొంది.

Updated Date - 2021-12-16T02:09:29+05:30 IST