తానా బోర్డు, ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2021-08-24T16:42:17+05:30 IST

తానా నూతన అధ్యక్షుడిగా లావు అంజయ్యచౌదరి తన కార్యవర్గంతో జులై 10న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

తానా బోర్డు, ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తానా నూతన అధ్యక్షుడిగా లావు అంజయ్యచౌదరి తన కార్యవర్గంతో జులై 10న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక తదుపరి విభాగాలైన తానా బోర్డు, తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గాలకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బోర్డు సభ్యులు డాక్టర్ హనుమయ్య బండ్ల ఛైర్మన్‌గా, డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి కార్యదర్శిగా, లక్ష్మి దేవినేని కోశాధికారిగా ఎన్నుకున్నారు. డాక్టర్ హనుమయ్య 2005-07 మధ్య తానా అధ్యక్షునిగా పని చేశారు. 2019-23 కాలానికి బోర్డు సభ్యునిగా సేవలందిస్తున్నారు. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ 2015లో తానా గ్రంథాలయ కమిటీ సభ్యునిగా, 2017-21 మధ్య బోర్డు సభ్యునిగా ఉన్నారు. 2021-25 కాలానికి బోర్డు సభ్యునిగా కొనసాగుతారు. లక్ష్మి దేవినేని తానాలో 2015-17లో న్యూయార్క్ ప్రాంతీయ కార్యదర్శిగా, 2019-21 మధ్య ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్‌గా, 2017-19లో ఉమెన్స్ కోఆర్డినేటర్‌గా సేవలందించారు. 2021-25 కాలానికి బోర్డు సభ్యురాలిగా కొనసాగుతారు. అలాగే 2021-23 కాలానికి ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్‌గా యార్లగడ్డ వెంకట రమణ,  కార్యదర్శిగా శశికాంత్ వల్లేపల్లి, కోశాధికారిగా శ్రీకాంత్ పోలవరపు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


యార్లగడ్డ వెంకట రమణ 2007 నుంచి 2009 వరకు మిడ్వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా, 2009 నుంచి 2013 వరకు ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న యార్లగడ్డ 2009-11 కాలానికి ఫౌండేషన్ కార్యదర్శిగా సేవలందించారు. 2019-23 కాలానికి మళ్ళీ ఫౌండేషన్ ట్రస్టీగా ఎన్నికై ఈ వచ్చే రెండేళ్లకు ఫౌండేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శశికాంత్ వల్లేపల్లి 2017-21 కాలానికి ఫౌండేషన్ సభ్యునిగా, కోశాధికారిగా పనిచేశారు. శ్రీకాంత్ పోలవరపు గతంలో సౌత్ వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధిగా, 2019-21 కాలానికి ఫౌండేషన్ సభ్యునిగా, టీం స్కేర్ కార్యక్రమాలలో అందరికీ అందుబాటులో ఉన్నారు. నూతనంగా ఎన్నికైన బోర్డు, ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అందరినీ కలుపుకుని తానా సేవాకార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్తాం అని దానికి ప్రణాళికలు కూడా సిద్దం చేసినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-24T16:42:17+05:30 IST