కొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-01-02T16:16:25+05:30 IST

కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, మంచి ఆశయాలతో క్రైస్తవులు ముందుకు సాగాలని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్‌ చర్చి (ఎంసీటీబీసీ) కాపరి రెవ.డా.ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ పిలుపు నిచ్చారు. స్థానిక వెపేరి

కొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలి

                     - ఎంసీటీబీసీ కాపరి రాజేంద్రప్రసాద్‌


ప్యారీస్‌(చెన్నై): కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలు, మంచి ఆశయాలతో క్రైస్తవులు ముందుకు సాగాలని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్‌ చర్చి (ఎంసీటీబీసీ) కాపరి రెవ.డా.ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ పిలుపు నిచ్చారు. స్థానిక వెపేరి హైరోడ్డులో ఉన్న ఎంసీటీబీసీ ప్రాంగణంలో శనివారం 2022 నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆంగ్లేయుల పాలనలో నిర్మితమై నగరంలోని తెలుగు క్రైస్తవులకు మాతృ సంఘంగా వ్యవహరిస్తున్న ఈ చర్చి నిర్వహణలో ఆంజనేయ నగర్‌, ఆశీర్వాదపురం, కార్నేశన్‌ నగర్‌, డా.అంబేడ్కర్‌ నగర్‌, అనంతనాయకి నగర్‌, నర్సింహ నగర్‌, కన్నికాపురం తదితర ప్రాంతాల్లో ఉన్న అనుబంధ సంఘాల సేవకుల ద్వారా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మహిళలు, పురుషులకు నూతన సంవత్సర కానుకగా చీరలు, ధోవతులు, చిన్నారులకు రెడీమేడ్‌ దుస్తులను రెవ.రాజేంద్రప్రసాద్‌, సంఘ కార్యదర్శి జి.ఇశ్రాయేల్‌ కొర్నేలియస్‌  పంపిణి చేశారు. అదే విధంగా, స్త్రీ సమాజం, యూత్‌, సండే స్కూల్‌ చిన్నారులకు స్టీల్‌ బాక్స్‌లను బహుమతిగా అందజేశారు. సంఘ ట్రెజరర్‌ ఏఎం కొండయ్య, పలు కమిటీల నిర్వాహకులు, సభ్యులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాల్గొని, విశ్వశాంతి కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.

Updated Date - 2022-01-02T16:16:25+05:30 IST