న్యూయార్క్‌లో 0.09 శాతం పాజిటివ్ రేటు.. ఆనందం వ్యక్తం చేసిన గవర్నర్

ABN , First Publish Date - 2020-08-03T07:39:23+05:30 IST

కరోనా కేసుల విషయానికి వస్తే అన్ని మంచి వార్తలే వినపడుతున్నాయని న్యూయార్క్ గవర్నర్

న్యూయార్క్‌లో 0.09 శాతం పాజిటివ్ రేటు.. ఆనందం వ్యక్తం చేసిన గవర్నర్

న్యూయార్క్: కరోనా కేసుల విషయానికి వస్తే అన్ని మంచి వార్తలే వినపడుతున్నాయని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆనందం వ్యక్తం చేశారు. గడిచిన 24 గంటల్లో న్యూయార్క్‌లో 58,951 కరోనా పరీక్షలు చేస్తే కేవలం 531 పాజిటివ్ కేసులు(0.09 శాతం) నమోదైనట్టు ఆండ్రూ క్యూమో తెలిపారు. పాజిటివ్ రేటు ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మరోపక్క ఐసీయూ అడ్మిషన్ల సంఖ్య కూడా 141కు తగ్గినట్టు ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో ముగ్గురు మరణించినట్టు ఆయన చెప్పారు. న్యూయార్క్‌లో ఇప్పటివరకు 4,44,850 కరోనా కేసులు నమోదుకాగా.. 32,780 మంది కరోనా బారిన పడి మరణించారు. మార్చి నెల నుంచి ఇప్పటివరకు న్యూయార్క్ ప్రభుత్వం 60 లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. అయితే ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించడంతో న్యూయార్క్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. ఇదే సమయంలో అమెరికాలోని అనేక రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. ఇక అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 48,05,628 కరోనా కేసులు నమోదు కాగా.. 1,58,248 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-08-03T07:39:23+05:30 IST