3వేల మందితో టైమ్స్‌ స్క్వేర్ వ‌ద్ద యోగా డే సెల‌బ్రెష‌న్స్‌

ABN , First Publish Date - 2021-06-22T16:42:43+05:30 IST

యోగా డే సంద‌ర్భంగా న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృతమైంది. టైమ్స్‌ స్క్వేర్ వ‌ద్ద ఒకేసారి 3వేల మంది యోగా చేశారు.

3వేల మందితో టైమ్స్‌ స్క్వేర్ వ‌ద్ద యోగా డే సెల‌బ్రెష‌న్స్‌

న్యూయార్క్‌: యోగా డే సంద‌ర్భంగా న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృతమైంది. టైమ్స్‌ స్క్వేర్ వ‌ద్ద ఒకేసారి 3వేల మంది యోగా చేశారు. ఏడో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం టైమ్స్‌ స్క్వేర్ వ‌ద్ద ఇలా 3వేల మంది యోగా డే సెల‌బ్రెష‌న్స్‌లో పాల్గొన‌డం విశేషం. 'సాల్‌స్టైస్ ఫ‌ర్ టైమ్ స్క్వేర్ 2021' థీమ్‌తో న్యూయార్క్‌లోని కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, టైమ్స్‌ స్క్వేర్ అలియ‌న్స్ సంయుక్తంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించాయి. "చారిత్ర‌త్మాక‌మైన టైమ్స్‌ స్క్వేర్‌లో యోగా డే నిర్వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంది. భార‌త్‌లో పుట్టిన యోగా ఇవాళ ప్ర‌పంచవ్యాపితమ‌వుతోంది. ఇది హ‌ర్షించ‌ద‌గిన విష‌యం. యోగాతో ఆరోగ్యం, ప్ర‌శాంత జీవ‌నం, ప్ర‌కృతితో మ‌మేకం వంటి ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ దైనందిన జీవ‌నంలో యోగాను భాగం చేసుకోవ‌డం ఎంతైన అవ‌స‌రం" అని కాన్సుల్ జ‌న‌ర‌ల్ రణ‌ధీర్ జైశ్వాల్ అన్నారు. కాన్సుల్ జ‌న‌రల్‌తో పాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌వాసులు, విదేశీయులు యోగాతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను చాలా చ‌క్క‌గా వివ‌రించారు. అలాగే న్యూజెర్సీలో కూడా యోగా డే సెల‌బ్రెష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో న్యూజెర్సీలోని లిబ‌ర్టీ స్టేట్ పార్క్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రఖ్యాత యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ తార న‌టాలీ పాల్గొన్నారు.       

Updated Date - 2021-06-22T16:42:43+05:30 IST