భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్.. 15 ఓవర్లకు ఎంతంటే?

ABN , First Publish Date - 2021-11-20T01:54:41+05:30 IST

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్

భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్.. 15 ఓవర్లకు ఎంతంటే?

రాంచీ: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలుత ఇన్నింగ్స్‌ను దాటిగా ప్రారంభించింది. మార్టిన్ గప్టిల్ చెలరేగిపోయాడు. 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.


ఆ తర్వాత మిచెల్, చాప్‌మన్ జోడీ కాసేపు క్రీజులో కుదురుకుని పరుగులు రాబట్టింది. 79 పరుగుల వద్ద రెండో వికెట్‌గా చాప్‌మన్ (21) అవుటైన తర్వాత స్కోరు వేగం మందగించింది. ఆపై కాసేపటికే ఓపెనర్ మిచెల్ (31) కూడా అవుటవడంతో పరుగులు రావడం నెమ్మదించింది.


క్రీజులో కుదురుకున్న గ్లెన్ ఫిలిప్స్ మాత్రం బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిశాయి. కివీస్ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఫిలిప్స్ 25, సీఫెర్ట్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-11-20T01:54:41+05:30 IST