Viral News: చీప్‌గా వస్తున్నాయని.. వేలంలో 5 సూట్‌కేసులు కొనుగోలు చేశారు.. తీరా వాటిని ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చూస్తే..

ABN , First Publish Date - 2022-08-18T13:58:47+05:30 IST

తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ వస్తువులు లభిస్తుంటే.. ఆ అవకాశాన్ని ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అందుకే ఆ దంపతులు కూడా వేలంలో పాల్గొన్నారు. చీప్‌గా వస్తున్నాయని.. ఏకంగా 5 సూట్‌కేస్‌లను కొనుగోలు చేశారు. సం

Viral News: చీప్‌గా వస్తున్నాయని.. వేలంలో 5 సూట్‌కేసులు కొనుగోలు చేశారు.. తీరా వాటిని ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తక్కువ ధరకే మంచి బ్రాండెడ్ వస్తువులు లభిస్తుంటే.. ఆ అవకాశాన్ని ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అందుకే ఆ దంపతులు కూడా వేలంలో పాల్గొన్నారు. చీప్‌గా వస్తున్నాయని.. ఏకంగా 5 సూట్‌కేస్‌లను కొనుగోలు చేశారు. సంతోషంగా వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వాటిని ఓపెన్ చేసి చూశారు. ఈ క్రమంలో సూట్‌కేసులో కనిపించిన దృశ్యాలు చూసి ఆ దంపతులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఆ భార్యభర్తలు పోలీస్‌ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.  దీంతో దంపతులకు సంబంధించిన షాకింగ్ అనుభవం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఆ దంపతులు ఎవరు? ఎక్కడ వేలంలో పాల్గొన్నారు? వాళ్లు కొనుగోలు చేసిన సూట్‌కేస్‌లలో ఏముంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..



న్యూజిలాండ్‌(New Zealand)లోని సౌత్ ఆక్లాండ్ ప్రాంతానికి చెందిన భార్యభర్తలు(Couple).. తాజాగా స్థానికంగా జరిగిన ఓ వేలంలో(Auction Process) పాల్గొన్నారు. అందులో చాలా తక్కవ ధరకు ఐదు బ్రాండెడ్ సూట్‌కేసులు కొనుగోలు చేశారు. తర్వాత వాటిని ఇంటికి తీసుకెళ్లారు. ఆనందంతో ఆ సూట్‌కేసులను ఓపెన్ చేశారు. తీరా అందులోని దృశ్యాలు చూసిన తర్వాత వారి ముఖాల్లోని ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. సూట్‌కేసుల(Suitcases)లో మృతదేహాల అవశేషాలు(Couple Found Human Remains) ఉండటంతో ఆ దంపతులు ఇద్దరూ కంగుతిన్నారు. వెంటనే పోలీసు(Police)లకు సమాచారం అందించారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న అధికారులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆ అవశేషాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ నిమిత్తం ఆ భార్యభర్తలు పోలీసు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా(Viral News) హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-08-18T13:58:47+05:30 IST