న్యూజిలాండ్ ప్రతిపక్ష నాయకుడి రాజీనామా

ABN , First Publish Date - 2020-07-14T14:31:31+05:30 IST

న్యూజిలాండ్ ప్రతిపక్ష నేషనల్ పార్టీ నాయకుడు టాడ్ ముల్లెర్ మంగళవారం అనూహ్యంగా రాజీనామా చేశారు....

న్యూజిలాండ్ ప్రతిపక్ష నాయకుడి రాజీనామా

వెల్లింగ్‌టన్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ ప్రతిపక్ష నేషనల్ పార్టీ నాయకుడు టాడ్ ముల్లెర్ మంగళవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. శాశ్వత నాయకుడిని ఎన్నుకునే వరకు డిప్యూటీ నేషనల్ పార్టీ నాయకుడు నిక్కి కాయే పార్టీకి నాయకత్వం వహిస్తారు.న్యూజిలాండ్ ప్రధానమంత్రి జకిందా ఆర్డెర్న్ లేబర్ పార్టీ అధికారాన్ని నిలుపుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ముల్లేర్ మే నెలలో ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని, తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నానని ముల్లేర్ చెప్పారు. నాలుగు నెలల్లో ప్రతిపక్షాలు మూడవ నాయకుడిని ఎన్నుకోనున్నాయి. న్యూజిలాండ్ కరోనా వైరస్ కేసుల గురించి ఓ పార్లమెంటు సభ్యుడు రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడంతో ప్రతిపక్ష ఎన్నికల అవకాశాలపై తీవ్ర దెబ్బ తగిలింది. రాజీనామా చేసిన ముల్లెర్ కు ప్రధాని జసిందా శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-07-14T14:31:31+05:30 IST