న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardernకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-05-14T13:09:08+05:30 IST

న్యూజిలాండ్ ప్రధానమంత్రి Jacinda Ardernకు శనివారం కొవిడ్ పాజిటివ్ అని తేలింది....

న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardernకు కొవిడ్ పాజిటివ్

వెల్లింగ్‌టన్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి Jacinda Ardernకు శనివారం కొవిడ్ పాజిటివ్ అని తేలింది.తనకు కరోనా సోకకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని జసిందా ఆర్డెర్న్ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్టు చేశారు. రాబోయే వారంలో న్యూజిలాండ్ ప్రభుత్వ వార్షిక బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. కొవిడ్ టీకాలు వేయించుకున్నా జసిందా ఆర్డెర్న్ కరోనా బారిన పడ్డారు.తనకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌కు కరోనా సోకిన తర్వాత ఆదివారం నుంచి ఆమె వెల్లింగ్టన్ నివాసంలో ఒంటరిగా ఉన్నారు. తన మూడేళ్ల కుమార్తె నీవ్‌కు బుధవారం వైరస్‌ పాజిటివ్‌గా తేలిందని ఆమె వెల్లడించారు.కొత్త ఒమైక్రాన్ ఆంక్షల కారణంగా న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు.


తన కుటుంబసభ్యులతో పాటు తనకు కరోనా సోకడం దురదృష్టకరమని ఆమె చెప్పారు.న్యూజిలాండ్‌లోని ఆరోగ్య నిబంధనల ప్రకారం ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే,ఆ కుటుంబసభ్యులు ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉండాలి.న్యూజిలాండ్ దేశంలో ఒమైక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.


Read more