విలియమ్సన్‌ వచ్చేశాడు

ABN , First Publish Date - 2021-06-16T06:35:03+05:30 IST

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అతడు బరిలోకి దిగుతాడని కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌...

విలియమ్సన్‌ వచ్చేశాడు

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అతడు బరిలోకి దిగుతాడని కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ చెప్పాడు. చారిత్రక టెస్ట్‌కు ముందు అతడికి తగినంత విశ్రాంతి దొరికిందని చెప్పాడు. 15 మంది సభ్యుల కివీస్‌ జట్టును  మంగళవారం ప్రకటించారు. ఎడమ మోచేతికి గాయమవడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు విలియమ్సన్‌ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో లాథమ్‌ సారథ్యంలో బరిలోకి దిగిన కివీస్‌ ఆ మ్యాచ్‌ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకొంది. వెన్నునొప్పి నుంచి కోలుకున్న వికెట్‌ కీపర్‌ బీజే వాట్లింగ్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా 32 ఏళ్ల అజాజ్‌ పటేల్‌, ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌కు జట్టులో స్థానం లభించింది. అయితే, ప్రస్తుత జట్టులోంచి ఐదుగురు ఆటగాళ్లు బ్రాస్‌వెల్‌, జాకబ్‌ డఫ్పీ, డరిల్‌ మిచెల్‌, రచిన్‌ రవీంద్ర, శాంట్నర్‌ను స్వదేశానికి తిప్పి పంపుతున్నట్టు కోచ్‌ స్టెడ్‌ చెప్పాడు. 

Updated Date - 2021-06-16T06:35:03+05:30 IST