ఫైజర్ తప్ప మరో వ్యాక్సిన్‌ను ఉపయోగించం: న్యూజిల్యాండ్

ABN , First Publish Date - 2021-03-09T06:26:46+05:30 IST

న్యూజిల్యాండ్ ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్‌ను తప్పించి మరో వ్యాక్సిన్‌ను వేయబోమని ఆ దేశ ప్రధాని జకిందా ఆర్డర్న్ స్పష్టం చేశారు.

ఫైజర్ తప్ప మరో వ్యాక్సిన్‌ను ఉపయోగించం: న్యూజిల్యాండ్

వెల్లింగ్టన్: న్యూజిల్యాండ్ ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్‌ను తప్పించి మరో వ్యాక్సిన్‌ను వేయబోమని ఆ దేశ ప్రధాని జకిందా ఆర్డర్న్ స్పష్టం చేశారు. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ సామర్థ్యం 95 శాతంగా ఉండటంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క న్యూజిల్యాండ్ జనాభా కేవలం 50 లక్షలలోపే ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. న్యూజిల్యాండ్ ప్రభుత్వం ఇప్పటికే తమ జనాభాకు అవసరమయ్యే వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయాల్సిందిగా ఫైజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫైజర్ వ్యాక్సిన్‌కు మొట్టమొదట అమెరికా ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులను ఇచ్చాయి. కాగా.. న్యూజిల్యాండ్‌లో ఇప్పటివరకు మొత్తం 2,405 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2021-03-09T06:26:46+05:30 IST