T20: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం.. ఫైనల్లోకి ప్రవేశం

ABN , First Publish Date - 2021-11-11T04:36:29+05:30 IST

T20: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం.. ఫైనల్లోకి ప్రవేశం

T20: ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం.. ఫైనల్లోకి ప్రవేశం

అబుదాబి: ఐసీసీ T20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తొలిసారి T20 ప్రపంచ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు అలవోకగా విజయం సాధించింది.  19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ మిషెల్ (72 నాటౌట్), కాన్వే (46)  విధ్వంసకర బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఇంగ్లండ్ జట్టులో అర్థ శతకం సాధించిన మోయీన్ అలీ (51), మలన్ (42) మాత్రం రాణించారు.

Updated Date - 2021-11-11T04:36:29+05:30 IST