చెట్ల పొదల్లో కనిపించిందో బ్యాగ్.. కదులుతూ ఉండటంతో అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు..

ABN , First Publish Date - 2022-06-03T03:06:03+05:30 IST

అది నిర్మానుష్య ప్రాంతం. ఏదో పనుండి అటువైపు కొందరు స్థానికులు వెళ్లారు. ఈ క్రమంలో వారికి చెట్ల పొదల్లో ఓ బ్యాగ్ కనిపించింది. అది కదులుతూ ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఏముందో తెలుసుకునేం

చెట్ల పొదల్లో కనిపించిందో బ్యాగ్.. కదులుతూ ఉండటంతో అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు..

ఇంటర్నెట్ డెస్క్: అది నిర్మానుష్య ప్రాంతం. ఏదో పనుండి అటువైపు కొందరు స్థానికులు వెళ్లారు. ఈ క్రమంలో వారికి చెట్ల పొదల్లో ఓ బ్యాగ్ కనిపించింది. అది కదులుతూ ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. అందులో ఏముందో తెలుసుకునేందుకు దాన్ని ఓపెన్ చేశారు. ఈ క్రమంలో బ్యాగులో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవగా.. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతంలో స్థానికులు ఓ బ్యాగును గుర్తించారు. అది కదులుతూ ఉండటంతో అనుమానం వ్యక్తం చేసి.. దాన్ని ఓపెన్ చేశారు. ఈ క్రమంలో అందులో ఓ చిన్నారిని చూసి కంగుతిన్నారు. వెంటనే స్థానిక అధికారులకు విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సమల్కా ప్రాంతానికి చెందిన చవీ అనే మహిళ ఆ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. పిల్లలను పెంచలేని వాళ్లకు కనే హక్కు లేదని వ్యాఖ్యానించారు. చవీ నిర్ణయాన్ని ఆమె భర్త కూడా స్వాగతించారు. కాగా.. చవీ భర్త స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Updated Date - 2022-06-03T03:06:03+05:30 IST