నాకు అమ్మాయి పుడితే.. అబ్బాయిని ఇచ్చారేంటని ఆస్పత్రి సిబ్బందిని నిలదీసిన తల్లి.. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-01-07T20:50:08+05:30 IST

ఆమెకు 22ఏళ్లు. ఏడాది క్రితం పెళ్లయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే బుధవారం రోజు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లాలోని ప్ర

నాకు అమ్మాయి పుడితే.. అబ్బాయిని ఇచ్చారేంటని ఆస్పత్రి సిబ్బందిని నిలదీసిన తల్లి.. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 22ఏళ్లు. ఏడాది క్రితం పెళ్లయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే బుధవారం రోజు ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కన్నకూతురిని  కల్లారా చూసి ఆ తల్లి మురిసిపోయింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు ఆ చిన్నారి మలమూత్రాలను విసర్జించడంతో సదరు మహిళ డైపర్ మార్చబోయింది. ఈ క్రమంలోనే ఆమె ఒక్కసారిగా షాకయింది. తన కూతురి స్థానంలో అబ్బాయి ఉండటంతో కంగుతింది. వెంటనే ఆసుపత్రి సిబ్బందిని నిలదీసింది. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌లోని  లలిత్‌పూర్‌ జిల్లాకు చెందిన 22ఏళ్ల రాజ్‌కుమారి.. పురిటి నొప్పులతో బాధపడుతూ బుధవారం జిల్లా మహిళా ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అక్కడ ఆమె అబ్బాయికి జన్మనిచ్చింది. రాత్రి 8 గంటల సమయంలో ఆ చిన్నారి వాంతులు చేసుకోవడంతో.. వైద్యులు రాజ్‌కుమారి కుమార్తెను చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. కొద్ది సమయం తర్వాత వైద్య సిబ్బంది బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చారు. గురువారం ఉదయం తన కూతురి డైపర్ మార్చబోయి రాజ్‌కుమారి ఒక్కసారిగా షాకైంది. తన కూతురి స్థానంలో వెరొక మహిళకు పుట్టిన అబ్బాయి ఉండటంతో కంగుతింది. వెంటనే వైద్య సిబ్బందిని ఆరా తీసింది. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 




అదే జిల్లాకు చెందిన రచనా (32) అనే మహిళ సాయంత్రం 5.30 గంటలకు బాబుకు జన్మనిచ్చిందని.. అబ్బాయి ఆరోగ్యం బాగోలేకపోతే ఆ చిన్నారిని కూడా పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఇద్దరి పిల్లలను ఆసుపత్రి నుంచి తీసుకొస్తూ.. పొరపాటున ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చినట్టు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే.. రచనా కుటుంబ సభ్యులను పిలిచి.. విషయాన్ని వివరించారు. ఆ తర్వాత చిన్నారులను వారి వారి తల్లులకు అప్పగించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-01-07T20:50:08+05:30 IST