నా సమస్యను ఎవరూ పరిష్కరించలేరంటూ.. పెళ్లైన కొన్ని గంటలకే వరుడు చేసిన పనేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-30T23:13:23+05:30 IST

అతడు భార్యతో కలిసి ఆనందంగా ఏడడుగులు నడిచాడు. ఆమె మెడలో మూడుముళ్లు వేసి జీవితాంతం తోడుంటాని ప్రమాణం చేసి.. భార్యని పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకువచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే ప్రశాంతత కోసం కొద్దిసేపు గుడికి

నా సమస్యను ఎవరూ పరిష్కరించలేరంటూ.. పెళ్లైన కొన్ని గంటలకే వరుడు చేసిన పనేంటో తెలిస్తే..

రాజస్థాన్: అతడు భార్యతో కలిసి ఆనందంగా ఏడడుగులు నడిచాడు. ఆమె మెడలో మూడుముళ్లు వేసి జీవితాంతం తోడుంటాని ప్రమాణం చేసి.. భార్యని పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకువచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన కొన్ని గంటలకే ప్రశాంతత కోసం కొద్దిసేపు గుడికి వెళ్లొస్తానని చెప్పి బయలుదేరాడు. తిరిగి ఎంతసేపయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడికి ఫోన్ చేశారు. అపుడు ఆ వరుడు చెప్పింది విని అంతా షాకయ్యారు. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


బిల్వా గ్రామానికి చెందిన 32 ఏళ్ల దినేష్ కుమావత్‌కు విరాట్ నగర్‌కు చెందిన యువతితో ఆదివారం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సోమవారం ఉదయం 9 గంటలకు వరుడు వధువుతో కలిసి తమ గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న దినేష్ సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లాడు. ప్రశాంతత కోసం తమ ఊర్లోని కోటకు దగ్గరల్లో ఉన్న గుడికి వెళ్లొస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరాడు. ఎంతసేపయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో దినేష్‌కు అతని సోదరుడు ఫోన్ చేశాడు. అపుడు అతడు చెప్పింది విని అందరూ షాకయ్యారు.


దినేష్ తాను భోపాల్‌గఢ్ కోట గోడ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు.. తన సమస్యను ఎవరూ పరిష్కరించలేరని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాని చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కిందకు దించే ప్రయత్నం చేశారు. దినేష్ ఎంతకూ దిగకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత శ్రమించినా అతడు వారి మాట కూడా విని కిందకు దిగలేదు. ఆపై తన దగ్గరికి ఎవరైనా రావాలని ప్రయత్నిస్తే తాను కిందకు దూకుతానని బెదిరించాడు. చివరగా దినేష్ మామ, అతడి బావ అతడికి పై నుంచి కిందకు దించి కాపాడారు. పోలీసులు మాట్లాడుతూ.. దినేష్ రైల్వే ఉద్యోగి అని చెప్పారు. పెళ్లైన కొన్ని గంటలకే అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానకి గల కారణమేంటని వారు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2021-11-30T23:13:23+05:30 IST