నవ వధువు 4 నెలల pregnant...పోలీసులకు భర్త ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-06-18T12:38:07+05:30 IST
నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన...
లక్నో(ఉత్తరప్రదేశ్): నవ వధువు నాలుగు నెలల గర్భవతి కావడంతో భర్త, అత్తమామలు షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో నవ వధువు నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.నవ వధువు కడుపునొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులకు చూపించగా ఆమె నాలుగు నెలల గర్భిణీగా తేలింది. నవ వధువుకు పెళ్లయి ఒకటిన్నర నెలలు మాత్రమే అయింది. కడుపునొప్పి రావడంతో నవవధువుకు సోనోగ్రఫీ పరీక్షలు చేయగా ఆమె గర్భిణీ అని ఆమె అత్తమామలకు తెలిసింది.దీంతో వారు కోడలిని ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.నవ వధువు భర్త పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
ఓ బంధువు మధ్యవర్తిత్వంతో పొరుగు జిల్లాకు చెందిన యువతితో నెలన్నర క్రితం వివాహం జరిగింది. నవ వధువు తమను మోసం చేసిందని భర్త, అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నవవధువు గర్భం దాల్చిన విషయం వారికి ముందే తెలుసునని, అయితే నిజం దాచిపెట్టారని భర్త ఆరోపించాడు. ఈ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు.