బాబోయ్.. Finger Prints‌తో ఇలా కూడా చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-05-20T15:12:40+05:30 IST

బాబోయ్.. Finger Prints‌తో ఇలా కూడా చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

బాబోయ్.. Finger Prints‌తో ఇలా కూడా  చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

  • ఫింగర్‌ ప్రింట్స్‌ క్లోనింగ్‌తో.. 
  • రూ.14.64 లక్షలు హాంఫట్‌
  • మినీ బ్యాంకింగ్‌ సర్వీస్‌ల పేరుతో మోసం


హైదరాబాద్‌ సిటీ : మినీ బ్యాంకింగ్‌ (Mini Banking Service) సర్వీస్‌ పేరిట ఓ యువకుడు కస్టమర్ల ఫింగర్‌ప్రింట్స్‌ తీసుకుని వారి ఖాతాల్లోని (Bank Account) డబ్బును కొల్లగొట్టాడు. కేవలం వారం రోజుల్లో రూ.14.64లక్షలు కాజేశాడు. సంబంధిత ఫ్రాంచైజీ అధికారుల విచారణలో ఈ మోసం వెలుగులోకి రావడంతో సైబరాబాద్‌ పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆల్వాల్‌కు చెందిన సందీ‌ప్‌కుమార్‌.. రోయింట్‌ సొల్యూషన్స్‌ ప్రై.లిమిటెడ్‌ వారి వద్ద మినీ బ్యాంకింగ్‌ సర్వీ్‌సలకు సంబంధించిన బిజినెస్‌ (Business) కరస్పాండెంట్‌గా ఫ్రాంచైజీ తీసుకున్నాడు. బ్యాంకింగ్‌ సేవలు అవసరమైన కస్టమర్స్‌కు సర్వీ్‌స్ అందించడం అతని పని. కస్టమర్స్‌ ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ల ఆధారంగా ఒక్కో కస్టమర్‌కు ఒక్కో యూసర్‌ ఐడీ (User Id), పాస్‌వర్డు (Password) ఇస్తారు. వారి బయోమెట్రిక్‌తో వారి బ్యాంకు ఖాతాలకు లాగిన్‌ అవుతారు. అలా వారి బ్యాంకు లావాదేవీలు జరిగిన తర్వాత క్లోజ్‌ చేసి పంపిస్తారు. ట్రాన్సాక్షన్‌లు చేసినందుకు కొంత కమీషన్‌ తీసుకుంటారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ప్రసాద్‌.. సందీప్‌కు పరిచయం అయ్యాడు.


‘మీ ఫ్రాంచైజీ తరఫున నేనూ బ్యాంకింగ్‌ సర్వీ్‌సలు అందిస్తాను. వచ్చిన కమీషన్‌లో కొంత చెల్లిస్తాను.. లైసెన్స్‌ ఇవ్వాలని’ అతను విజ్ఞప్తి చేశాడు. బిజినెస్‌ బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రసాద్‌కు లైసెన్స్‌ ఇచ్చాడు. ఇదే అదునుగా భావించిన ప్రసాద్‌.. బ్యాంకు సర్వీస్‌ల కోసం తన వద్దకు వచ్చిన కస్టమర్స్‌ యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నోట్‌ చేసుకునేవాడు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్‌ సమయంలో వారు ఉపయోగించే ఫింగర్‌ ప్రింట్స్‌ను చాకచక్యంగా క్లోనింగ్‌ చేసేవాడు. కస్టమర్‌ వెళ్లిన తర్వాత వారి యూసర్‌ ఐడీ పాస్‌వర్డ్‌తోపాటు.. క్లోనింగ్‌ చేసిన ఫింగర్‌ ప్రింట్స్‌తో వారి బ్యాంకు ఖాతాలోకి లాగిన్‌ అయి కొంతమొత్తంలో డబ్బును వేరే ఖాతాలకు మళ్లించేవాడు.


ఇలా సరిగ్గా వారం రోజుల్లో 149 మంది కస్టమర్స్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ క్లోనింగ్‌ చేసిన కేటుగాడు వారి ప్రమేయం లేకుండా రూ. 14 లక్షల 64వేల 679 కొల్లగొట్టాడు. ఇటీవల ఫ్రాంచైజీ తీసుకున్న సందీప్‌ బిజినెస్‌ ట్రాన్సాక్షన్స్‌ చెక్‌చేస్తున్న క్రమంలో ఈ మోసాన్ని గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా కస్టమర్స్‌ ఫింగర్‌ప్రింట్స్‌ క్లోనింగ్‌ చేసి డబ్బులు కొల్లగొట్టినట్లు గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నికల్‌ ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-20T15:12:40+05:30 IST