కడుపునిండా కమ్మటి భోజనం.. ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి..!

ABN , First Publish Date - 2022-05-28T17:18:21+05:30 IST

‘కడుపునిండా కమ్మటి భోజనం (Food) పెట్టారు’.. ‘ఐటమ్స్‌ చాలా బాగున్నాయ్‌ కదా’...

కడుపునిండా కమ్మటి భోజనం.. ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి..!

  • తెలుగు వంటకాల ఘుమఘుమ
  • వివిధ జిల్లాలకు చెందిన ప్రత్యేక ఐటమ్స్‌
  • అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు

ఒంగోలు : ‘కడుపునిండా కమ్మటి భోజనం (Food) పెట్టారు’.. ‘ఐటమ్స్‌ చాలా బాగున్నాయ్‌ కదా’. ‘స్వీట్లు (Sweets) కూడా వెరైటీగా ఉన్నాయ్‌’. ‘పచ్చిపులుసు సూపర్‌’...! ఇవి మహానాడు (Mahanadu) ప్రాంగణంలో తొలిరోజు భోజనం చేసిన వారి నోటి నుంచి వినిపించిన మాటలు.  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు మంచి భోజనం అందజేయటానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.


వివిధ జిల్లాల నుంచి చెయ్యి తిరిగిన వంటవారిని రప్పించి వంటకాలను తయారుచేయించారు. శుక్రవారం ఉదయం అల్పాహారం చేసిన వారు, మధ్యాహ్నం భోజనం చేసిన  వారు ఆయా వంటకాల రుచిని ఆస్వాదిస్తూ పార్టీ చేసిన ఏర్పాట్లను కొనియాడారు. దాదాపు 20 కౌంటర్లను ఏర్పాటుచేశారు.


సాధారణ వైట్‌ రైస్‌, మామిడి కాయ పప్పు, కొబ్బరన్నం, వెజిటబుల్‌ పలావ్‌, సాంబారు, అప్పడాలు, వడియాలతో పాటు యాపిల్‌ హల్వా, నేరేడు హల్వా, అద్వానీ పకోడి, వెజిటబుల్‌ బుల్లెట్‌, కళాయి వెజ్‌ కూర్మా, తాపేశ్వరం కాజా, నేతి మైసూర్‌ పాక్‌, అరిటి గ్రేవీ కర్రీ, మిక్స్‌డ్‌ వెజ్‌ చెట్నీ, ఆలు కట్‌ బజ్జీ, బాదం బర్ఫీ, గుత్తి వంకాయ గ్రేవీ వంటి దాదాపు 27 రకాల వంటకాలు శుక్రవారం నాటి భోజనంలో ఉన్నాయి.



Updated Date - 2022-05-28T17:18:21+05:30 IST