Advertisement

రాశిని వద్దంటున్నాడా?

Jan 20 2021 @ 17:45PM

`ప్రతి రోజూ పండగే` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ మారుతి ఇటీవల తన తర్వాతి సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చాడు. మాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 


ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు రాశీ ఖన్నాను తీసుకోవాలని మారుతి భావిస్తున్నాడట. `ప్రతి రోజూ పండగే` సినిమాలో టిక్‌టాక్ స్టార్ పాత్రలో రాశి మంచి నటన కనబరిచింది. అందుకే రాశినే రిపీట్ చేయాలని మారుతి అనుకుంటున్నాడట. అయితే గోపీచంద్ ఇప్పటికే `జిల్`, `ఆక్సిజన్` సినిమాల్లో రాశితో నటించాడు. రెండు సినిమాలూ డిజాస్టర్లుగానే నిలిచాయి. అందుకే రాశి కాకుండా మరో హీరోయిన్ అయితే బాగుంటుందని గోపీచంద్ అనుకుంటున్నాడట. మరి, ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.