Husbandతో విడాకులు.. కొడుకుతో కలిసుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. సడన్‌గా ఏమైందో కానీ..!?

ABN , First Publish Date - 2022-05-16T14:49:37+05:30 IST

Husbandతో విడాకులు.. కొడుకుతో కలిసుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. సడన్‌గా ఏమైందో కానీ..!?

Husbandతో విడాకులు.. కొడుకుతో కలిసుంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. సడన్‌గా ఏమైందో కానీ..!?

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ (Software) ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ (Police Station) పరిధిలో శనివారం జరిగింది. కొండాపూర్‌లోని జేవీజీ హిల్స్‌ అర్బన్‌హైట్స్‌లో నివాసం ఉంటున్న నక్కపల్లి సుభాషిణి (41)సా‌ఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. చాలా కాలం క్రితం భర్తతో విడాకులు తీసుకుని కుమారుడు గోవర్దన్‌ కౌశిక్‌తో కలిసి ఉంటోంది. శనివారం రాత్రి గోవర్దన్‌ కౌశిక్‌ బయటినుంచి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూంలో సుభాషిణి ఉరేసుకుని కనిపించింది. దీంతో అతను పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. తన తల్లి కొంతకాలంగా ఆరోగ్యసమస్యలతో మందులు వాడుతోందని, తరచూ మానసిక ఆందోళనకు గురవుతుందని కౌశిక్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపారు.

Updated Date - 2022-05-16T14:49:37+05:30 IST