పిల్లలకు ఫైజర్ టీకా అనుమతిచ్చిన న్యూజిల్యాండ్

ABN , First Publish Date - 2021-06-22T04:58:22+05:30 IST

ఫైజర్ టీకాను చిన్నపిల్లలకు వేయడానికి మరో దేశం పచ్చజెండా ఊపింది. కెనడాలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వడానికి అనుమతులు లభించాయి.

పిల్లలకు ఫైజర్ టీకా అనుమతిచ్చిన న్యూజిల్యాండ్

వెల్లింగ్టన్: ఫైజర్ టీకాను చిన్నపిల్లలకు వేయడానికి మరో దేశం పచ్చజెండా ఊపింది. కెనడాలో తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వడానికి అనుమతులు లభించాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కోదేశమూ అనుమతులు ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్‌లో కూడా పిల్లలకు ఫైజర్ టీకా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జకిండా ఆర్డెన్స్ సోమవారం ఒక ప్రకటన చేశారు. తాజా సైంటిఫిక్, మెడికల్ డేటాను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అలాగే న్యూజిల్యాండ్‌లో 12-15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు సుమారు 2.65 లక్షలమంది ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T04:58:22+05:30 IST