మొన్న ఏసీపీ... నేడు ఆర్డీవో బదిలీ

May 9 2021 @ 00:31AM
హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డికి అభినందనలు తెలుపుతున్న సిబ్బంది

హుజూరాబాద్‌, మే 8: తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ నేపథ్యంలో హుజూరాబాద్‌లోని డివిజన్‌ స్థాయి అధికారుల బదిలీలు మొదలయ్యాయి. మూడు రోజుల క్రితం హుజూరాబాద్‌ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావును బదిలీ చేయగా తాజాగా ఆర్డీవో బెన్‌షాలేమ్‌ను హైద్రాబాద్‌కు బదిలీ చేశారు. డివిజన్‌లోని పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన అధికారులను కూడా బదిలీ చేయనున్నట్లు తెలిసింది. 

హుజూరాబాద్‌ ఆర్డీవోగా సీహెచ్‌ రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఆర్డీవో బెన్‌షాలేమ్‌ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మె దక్‌ జిల్లా నర్సాపూర్‌లో పనిచేస్తున్న రవీందర్‌రెడ్డిని హుజూరాబాద్‌ ఆర్డీవోగా నియమిస్తూ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించగా డివిజన్‌లోని రెవెన్యూ సిబ్బంది రవీందర్‌రెడ్డికి స్వాగ తం పలికి అభినందనలు తెలిపారు.

ఫహుజూరాబాద్‌ డివిజన్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీ

హుజూరాబాద్‌/వీణవంక, మే8: హుజూరాబాద్‌ డివిజన్‌లో పలువురు తహసీల్లార్లు, ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. హుజూరాబాద్‌ తహసీల్దార్‌ బావుసింగ్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు, వీణవంక, జమ్మికుంట తహసీల్దార్లు కనకయ్య, నారాయణను పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో ఎవరినీ నియమించలేదు. హుజూరాబాద్‌ ఎంపీడీవో కృష్ణప్రసాద్‌ను కొడిమ్యాలకు, అక్కడ పని చేస్తున్న రమేష్‌ను హుజూరాబాద్‌కు బదిలీ చేశారు. జమ్మికుంట ఎంపీడీవో జయశ్రీని మెట్‌పల్లికి, అక్కడ పని చేస్తున్న కల్పనను జమ్మికుంటకు, వీణవంక ఎంపీడీవోను కోరుట్లకు, అక్కడ పని చేస్తున్న శ్రీనివాసులను వీణవంకకు బదిలీ చేశారు.

Follow Us on: