
- మంత్రి రామచంద్రన్ వ్యాఖ్యలు
పెరంబూర్(చెన్నై): స్టాలిన్ తర్వాత ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారని మంత్రి రామచంద్రన్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌లో డీఎంకే ఏడాది పాలనను ప్రజలకు తెలియజేసేలా గురువారం రాత్రి జరిగిన బహిరంగసభలో పాల్గొన్న మంత్రి రామచంద్రన్ మాట్లాడుతూ, కరుణానిధి తర్వాత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఉదయనిధి సిద్ధమయ్యారని అన్నారు. వారసులే అయినా వీరు కార్యకర్త స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన వారని చెప్పారు. ప్రస్తుతం డీఎంకేకు పోటీ ఎవరూ లేరని, తొలుత తమలో నెలకొన్న విభేదాలు, మనస్పర్థలు పరిష్కరించుకొని తర్వాత డీఎంకేతో పోటీకి సిద్ధం కావాలని అన్నాడీఎంకే నేతలకు ఆయన హితవు పలికారు. పదేళ్లు పరిపాలించిన అన్నాడీఎంకే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టివెళ్లిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రజలకు అవసరమైన పథకాలను ముఖ్యమంత్రి విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ప్రతి కుటుంబంలో సీఎం ఉన్నారని అన్నారు. ఢిల్లీకి రాజకీయాలకు భయపడని ప్రభుత్వంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి