Advertisement

మొన్న ముగింపు.. నేడు ప్రారంభం

Jan 22 2021 @ 05:34AM

ఒక ప్రయాణం ముగిసింది, మరో ప్రయాణం ప్రారంభమైంది అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు రకుల్‌. ఆమె తమిళంలో రవికుమార్‌ దర్శకత్వంలో హీరో శివ కార్తికేయన్‌తో ‘అయలాన్‌’ చిత్రం చేస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ దాదాపు ముగిసిందని రకుల్‌ ట్విట్టర్లో తెలిపారు. 


తాజాగా ఆమె నటిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘థ్యాంక్‌ గాడ్‌’ షూటింగ్‌ గురువారం ముంబైలో ప్రారంభమైంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్నారు. నిర్మాత భూషణ్‌కుమార్‌ పూజా కార్యక్రమంతో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు. ఇంద్రకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌లో సిద్ధార్థ్‌, రకుల్‌ పాల్గొంటారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.