కొవిడ్ తరువాత వచ్చే మహమ్మారి మరింత దారుణంగా ఉండొచ్చు: బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-06T23:35:18+05:30 IST

బ్రిటన్ శాస్త్రవేత్త ప్రొ. శారా గిల్బర్ట్ కీలక హెచ్చరిక చేశారు. కరోనా తరహా మహమ్మారులను ఎదుర్కొనేందుకు శాస్త్రసాంకేతిక రంగాలకు ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోతే.. భవిష్యత్తులో వచ్చే సంక్షోభం మరింత దారుణంగా ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. వైరస్‌లను అడ్డుకోవడంలో మానవాళి ఇప్పటివరకూ సాధించిన ప్రగతిని కోల్పోకూడదని..

కొవిడ్ తరువాత వచ్చే మహమ్మారి మరింత దారుణంగా ఉండొచ్చు:  బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక

లండన్: కరోనా సంక్షోభం ముగిసిందనుకుంటున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచానికి ఊహించని షాకిచ్చింది. ఈ నేపథ్యంలో  బ్రిటన్ శాస్త్రవేత్త ప్రొ. శారా గిల్బర్ట్ కీలక హెచ్చరిక చేశారు. కరోనా తరహా మహమ్మారులను ఎదుర్కొనేందుకు శాస్త్రసాంకేతిక రంగాలకు ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోతే.. భవిష్యత్తులో వచ్చే సంక్షోభం మరింత దారుణంగా ఉండొచ్చని  ఆమె వ్యాఖ్యానించారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా రూపకర్తల్లో ఒకరైన ప్రొ. శారా.. ఓ టీవీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టిడికి చేసిన ఖర్చు ఆర్థికంగా భారమవుతున్న కారణంతో శాస్త్రపరిశోధనలకు నిధుల కేటాయింపులు తగ్గకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రమాదకర వైరస్‌లను అడ్డుకోవడంలో ఇప్పటివరకూ మానవాళి సాధించిన ప్రగతిని కోల్పోకూడదని పేర్కొన్న ఆమె.. కరోనా కంటే ప్రమాదకరమైన సంక్షోభాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆమె ప్రసంగించిన కార్యక్రమం సోమవారం ప్రసారమవుతుంది. 



Updated Date - 2021-12-06T23:35:18+05:30 IST