తెలంగాణ Mining Department, Pollution Control Boardపై NGT ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-12T01:01:13+05:30 IST

తెలంగాణ Mining Department, Pollution Control Boardపై NGT ఆగ్రహం

తెలంగాణ Mining Department, Pollution Control Boardపై NGT ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ మైనింగ్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టోన్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులు లేకపోతే.. తక్షణమే మైనింగ్ ఆపాలని తెలంగాణ మైనింగ్ శాఖకు ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. చర్యలు తీసుకోని తెలంగాణ మైనింగ్, పీసీబీపై ఎన్జీటీ మండిపడింది. అనుమతి లేని క్వారీలను కొనసాగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎన్జీటీ తెలిపింది. అక్రమ మైనింగ్‌పై ఏం చర్యలు తీసుకున్నారో వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా బండారావిరాల, దేశముఖి మండలాల్లో క్వారీ జోన్‌లో అక్రమ మైనింగ్‌తో పర్యావరణ సమస్యలపై ఎన్జీటీలో పిటిషన్లు పి.ఇందిరారెడ్డి, ఎ.నిఖిల్‌రెడ్డి దాఖలు చేశారు. సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ధర్మాసనం పరిశీలించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది.

Read more