సింగరేణిపై కేసు కొట్టివేత

ABN , First Publish Date - 2022-10-05T06:31:52+05:30 IST

సింగరేణి కారణంగా సత్తుపల్లి ప్రాంతంలో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు 2019లో కొందరు వెళ్లారు.

సింగరేణిపై కేసు కొట్టివేత

జేవీఆర్‌, కిష్టారం ఓసీలపై ఎన్జీటీలో స్థానికుల కేసు

విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం

వీసీలో ప్రత్యేక తీర్పుతో ఆదేశాలు జారీ

సత్తుపల్లి, అక్టోబర్‌ 4: సింగరేణి కారణంగా సత్తుపల్లి ప్రాంతంలో ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు 2019లో కొందరు వెళ్లారు. ఈ క్రమం లో కేసు పూర్వపరాలను విచారించిన ఇద్దరు జడ్జీల న్యాయస్థానం ఆరోపణలు నిరాధారమని ప్రకటించింది. కేసును కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. సత్తుపల్లి కేం ద్రంగా బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న జేవీఆర్‌ ఓసీ, కిష్టారం ఓసీపీలపై ఇక్కడి కొందరు కేసు వేశారు. ‘సింగరేణి కారణంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటు న్నారు. సింగరేణికి సైతం అనుమతులు లేకుండా, నష్టపరిహారం చెల్లించకుండా, పర్యావర ణానికి హాని చేస్తూ ఉత్పత్తి సాగిస్తోంది. రైల్వేలైన్‌ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని’ పేర్కొంటూ కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలో గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ విచారణ జరిపిన తర్వాత సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టి పనులు, పైన పేర్కొన్న అంశాలపై వాదోపవాదాలను న్యాయస్థానం పరిశీలించింది. ఈ మే రకు ఇరువురు న్యాయమూర్తులు రామకృష్ణన్‌, డాక్టర్‌ సత్యగోపాల్‌ కొర్లపాటి కేసులో పొం దుపరిచిన వివరాలు నిరాధారమని పేర్కొంటూ కొట్టివేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చెన్నై నుంచి తీర్పును ఇచ్చారు.

Updated Date - 2022-10-05T06:31:52+05:30 IST