ISIS ఉగ్రవాదికి NIA కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-05-28T12:51:27+05:30 IST

మహారాష్ట్రలోని పర్భానీ కేసులో ISIS ఉగ్రవాదికి NIA కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది...

ISIS ఉగ్రవాదికి NIA కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష

ముంబై: మహారాష్ట్రలోని పర్భానీ కేసులో ISIS ఉగ్రవాదికి NIA కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.మహారాష్ట్రలోని పర్భానీలో తీవ్రవాద దాడి చేసిన కేసులో ఐఎస్‌ఐఎస్ యువకుడిని దోషిగా ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్ధారించింది.ముంబైలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఐఎస్ఐఎస్ ఉగ్రవాది మహ్మద్ షాహెద్ ఖాన్ అలియాస్ లాలాకు 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.45,000 జరిమానా విధించింది.ఇంటర్నెట్ ద్వారా భారతీయ యువతను మార్చేందుకు సిరియాలోని ఐసిస్ కార్యకర్తలు పన్నిన కుట్ర కేసుకు సంబంధించి ఈ తీర్పు వెలువడింది. సిరియా ఉగ్రవాదుల సూచన మేరకు దోషి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని తయారు చేశారు.మహ్మద్ షాహెద్ ఖాన్ అలియాస్ లాలాపై ముంబైలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 13,16,18,20,38,39 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-05-28T12:51:27+05:30 IST