NIA Raids:దేశంలోని 60 ప్రాంతాల్లో గ్యాంగ్‌స్టర్లపై ఎన్ఐఏ దాడులు

ABN , First Publish Date - 2022-09-12T16:39:10+05:30 IST

జాతీయ పరిశోధనా సంస్థ(ఎన్ఐఏ)(National Investigation Agency) గ్యాంగ్‌స్టర్లు(gangsters), క్రైం సిండికేట్లపై దృష్టిసారించింది...

NIA Raids:దేశంలోని 60 ప్రాంతాల్లో గ్యాంగ్‌స్టర్లపై ఎన్ఐఏ దాడులు

న్యూఢిల్లీ: జాతీయ పరిశోధనా సంస్థ(ఎన్ఐఏ)(National Investigation Agency) గ్యాంగ్‌స్టర్లు(gangsters), క్రైం సిండికేట్లపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపింది. దేశంలోని 60ప్రాంతాల్లో సోమవారం ఎన్ఐఏ అధికారులు పలు గ్యాంగ్‌లు, నేరాల సిండికేట్లపై(gangs and crime syndicates) మెరుపు దాడులు(NIA Raids) చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని(Delhi, National Capital Region, Haryana, Uttar Pradesh and Punjab) 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు గ్యాంగ్‌లు, నేరాల సిండికేట్లపై సోదాలు జరిపారు.ఢిల్లీలో నేరాలు సాగిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi gang), బంబిహా, నీరజ్ బవానా గ్యాంగులకు చెందిన 10 మంది గ్యాంగ్ స్టర్లపై ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఉపా(Unlawful Activities Prevention Act)కింద కేసులు నమోదు చేశాక ఎన్ఐఏ దర్యాప్తు ఆరంభించింది.


 సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. నీరజ్ షేరావత్ అలియాస్ నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులకు మధ్య యుద్ధం సాగుతుందని దర్యాప్తులో తేలింది. దేశంలో గ్యాంగ్ స్టర్లు జైళ్లలో నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల సోదాల్లో వెల్లడైంది. భారతదేశంతోపాటు కెనడా, పాకిస్థాన్, దుబాయ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డియా బ్రార్, విక్రం బ్రార్, జగ్గు భగవాన్ పురియా, సందీప్, సచిన్ తాపన్, అనమోల్ బిష్ణోయ్ లు వారి గ్యాంగుల కార్యకలాపాలను లోపల నుంచి సాగిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల సోదాల్లో తేలింది. 


లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఖలీస్థానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రింధాకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. తీహార్, హర్యానా జైళ్లలో ఉన్న కౌషల్ చౌదరి, లక్కీ పాటియాల్, లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా గ్యాంగ్ లపై కూడా యూఏపీఏ కింద కేసులు పెట్టాలని ఎన్ఐఏ నిర్ణయించింది. 


Updated Date - 2022-09-12T16:39:10+05:30 IST