Madhya Pradeshలో ఎన్‌ఐఏ కార్యాలయం.. ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు: మంత్రి

ABN , First Publish Date - 2022-05-11T23:34:49+05:30 IST

Madhya Pradeshలో ఎన్‌ఐఏ కార్యాలయం.. ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు: మంత్రి

Madhya Pradeshలో ఎన్‌ఐఏ కార్యాలయం.. ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు: మంత్రి

భోపాల్: ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) త్వరలో రాష్ట్రంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక సంస్థ కార్యాలయం లేదన్నారు. కొన్ని నెలల క్రితం రాష్ట్ర పోలీసులు ఉగ్ర సంస్థకు చెందిన కొందరిని అరెస్టు చేయడం గమనార్హం. త్వరలో మధ్యప్రదేశ్‌లో ఎన్‌ఐఏ శాఖను ప్రారంభించబోతోందని, రాష్ట్రంలోని అల్-సూఫా, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) వంటి సంస్థల  ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఏజెన్సీ విచారణ జరుపుతోంద మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భోపాల్ నుంచి నిషేధిత జేఎంబీకి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మార్చిలో అల్-తో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భోపాల్ నుంచి నిషేధిత జేఎంబీకి చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రాజస్థాన్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మార్చిలో అల్-తో సంబంధం ఉన్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. చిత్తోర్‌గఢ్ (రాజస్థాన్)లోని నింబహెడలో పోలీసులు వారి కారులో 12 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Read more