ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష!

ABN , First Publish Date - 2021-03-02T03:34:47+05:30 IST

న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపాడంటూ దాఖలైన కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష!

ప్యారిస్: న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపాడంటూ దాఖలైన కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం  ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం నాడు తీర్పు వెలువరించింది. అయితే..ఆయన మాత్రం తనతప్పేమీ లేదని చివరివరకూ వాదించే ప్రయత్నం చేశారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు సర్కోజీకి పది రోజుల సమయం లభించింది.  ఇటువంటి అవినీతి కేసులో దోషిగా తేలిన రెండో అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ. అంతకుమునుపు..జాక్వస్ చిరాక్ కూడా అవినీతి ఆరోపణల కేసులో దోషిగా తేలారు. 2007 నుంచి 2012 వరకూ సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే..ఇప్పటికీ ఆయనకు కన్సర్వేటివ్ నేతల్లో మంచి పలుకుబడి ఉంది. 

Updated Date - 2021-03-02T03:34:47+05:30 IST