నిడుమోలు–ముదినేపల్లి జాతీయ రహదారిగా గుర్తింపు

Published: Sun, 22 May 2022 00:47:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిడుమోలు–ముదినేపల్లి జాతీయ రహదారిగా గుర్తింపు ముదినేపల్లి–గుడ్లవల్లేరు రోడ్డు

ముదినేపల్లి, మే 21 : కృష్ణాజిల్లా నిడుమోలు నుంచి ఏలూరు జిల్లా ముదినేపల్లి వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. సుమారు 30 కిలో మీటర్ల దూరం కలిగిన ఈ రహదారి ప్రస్తుతం 15 మీటర్ల వెడల్పు ఉన్నది. దీనిని 30 మీటర్ల వెడల్పున విస్తరి స్తారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో  గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఈ రహదారిని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. ఈ రహదారి ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం, కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు, గూడూరు, మొవ్వ మండలాల్లో విస్తరించి ఉంది. ముదినేపల్లి నుంచి గుడ్లవల్లేరు, కవుతరం, డోకిపర్రు మీదుగా నిడుమోలులో విజయవాడ – మచిలీపట్నం రహదారిలో కలుస్తుంది. ఈ రూటులోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న డోకిపర్రు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.