పరిచయం బాలీవుడ్లో అయినప్పటికీ.. తన నిధిలాంటి అందాలతో టాలీవుడ్‌ని హీటెక్కిస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' వంటి చిత్రాలలో కాస్త కూల్‌గా దర్శనమిచ్చిన ఈ బ్యూటీ రామ్‌తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్'తో ప్రేక్షకులకి గ్లామర్ విందు ఇచ్చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో తరచూ.. ఫొటోలతో పిచ్చెక్కించేస్తూనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటో చూసిన ప్రతి ఒక్కరికీ మతిపోతోంది. నిధి సొగసులు చూసేందుకే అన్నట్లుగా ఆమె ఇచ్చిన ఆ ఫోజు.. చూపరులను చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఇంకా డౌట్‌గా ఉంటే.. మీరూ ఓ లుక్కేయండి మరి.