లాభాల బాటలోనే సాగిన నిఫ్టీ...

ABN , First Publish Date - 2021-06-23T00:53:42+05:30 IST

నిఫ్టీ ఇవాళ( మంగళవారం) ఉదయం నుంచి లాభాల బాటలోనే సాగినా ఆఖరిలో మాత్రం లాభాలను కొంతమేర కోల్పోయింది. చివరకు 26 పాయింట్ల లాభంతో 15772 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల బాటలోనే సాగిన నిఫ్టీ...

ముంబై : నిఫ్టీ ఇవాళ( మంగళవారం) ఉదయం నుంచి లాభాల బాటలోనే సాగినా ఆఖరిలో మాత్రం లాభాలను  కొంతమేర కోల్పోయింది. చివరకు 26 పాయింట్ల లాభంతో 15772 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా లే ఎగసినట్లే ఎగసి, చివరకు నామమాత్రంగా 14 పాయింట్ల లాభంతో 52588 పాయింట్ల సమీపంలో ముగిసింది. నిప్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు ఆరంభంలో అదరగొట్టి, చివరకు నష్టాల్లో ముగియగా, హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు అరశాతం వరకూ లాభపడ్డాయి. కాగా... కేపిటల్ గూడ్స్ ఇండెక్స్ మాత్రం ఏకంగా 2 శాతం వరకూ పెరిగింది. ఆటో ఐటీ స్టాక్స్ మంచి లాభాలతో ముగియగా, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు గత నష్టాల సెషన్ల నుంచి కాస్త ఒకింత కుదుటపడ్డాయి. 


మారుతిసుజికి ఏకంగా 5.30శాతం లాభపడటం సెషన్ హైలైట్. ఒక్క రోజులోనే రూ. 365 పెరిగి రూ. 7625 వద్ద ముగిసిందీ స్టాక్ టాటా మోటర్స్ ఒక శాతానికిపైగా పెరిగి రూ. 337.90 వద్ద ముగిసింది. బజాజ్ ఆటో .93 శాతం పెరిగి రూ. 4221.60 వద్ద ముగియగా, భారత్ ఫోర్జ్ 1.59 శాతం పెరిగి రూ. 741.20 వద్ద , ఐషర్ మోటర్స్  0.73 శాతం పెరిగి రూ. 2718.20 వద్ద ట్రేడింగ్ ముగించాయ్. 

Updated Date - 2021-06-23T00:53:42+05:30 IST