Night curfew ఎత్తివేత

ABN , First Publish Date - 2022-01-28T12:56:21+05:30 IST

తమిళనాట రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. అదేవిధంగా ఆది వారాల్లో అమలు చేస్తున్న సంపూర్ణ కఠిన లాక్‌డౌన్‌ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ప్రకటించారు. ఈ ఆదేశాలు శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి. గురువారం

Night curfew ఎత్తివేత

- ఆదివారం లాక్‌డౌన్‌ రద్దు 

-1 నుంచి మళ్లీ బడులు


చెన్నై: తమిళనాట రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. అదేవిధంగా ఆదివారాల్లో అమలు చేస్తున్న సంపూర్ణ కఠిన లాక్‌డౌన్‌ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ప్రకటించారు. ఈ ఆదేశాలు శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి. గురువారం సచివాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికం కావటంతో ఈ నెల 7 నుండి రాత్రి పూట కర్ప్యూ, 9వ తేదీ నుండి ఆదివారాల్లో కఠిన నిబంధనలతో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, కరోనా సోకిన వారికి అంతంతమాత్రంగానే లక్షణాలున్నట్లు తేలడం తదిత రాల నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి కొంతమందికి ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. పదోతరగతి, ప్లస్‌-1, ప్లస్‌-2 విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక ఎప్పటిలానే రాష్ట్రంలో అమలు చేస్తున్న 16 రకాలకరోనా నిరోధక నిబంధనలు కొనసాగుతాయని ఆయన వివరిం చారు. బహిరంగ సభలపై నిషేధం కొనసాగనుంది. ప్లేస్కూల్‌, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల రద్దు, ఎగ్జిబిషన్ల నిర్వహణపై నిషేధం, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల తరఫున అన్ని సాంస్కృతిక కార్యక్రమాల రద్దు, హోటళ్ళు రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో 50 శాతం మంది వరకే అనుమతి, శుభకార్యాలకు వందమందికి, అంత్యక్రియలకు 50 మందిని అనుమతి వంటి నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని స్టాలిన్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-01-28T12:56:21+05:30 IST