సిబ్బందికి సూచనలిస్తున్న సీఐ
కొవ్వూరు, జనవరి 20: కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని పట్టణ సీఐ పి.సునీల్‌కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బందికి కర్ఫ్యూ అమలుపై గురువారం సూచనలు చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉద యం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఎవరు రోడ్లపై సంచరించినా కేసులు నమోదు చేయాలన్నారు. ఇతర సమయాల్లో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే చర్యలు తప్పవన్నారు.