కొవిడ్ కేసుల పెరుగుదలతో జమ్మూలో Night curfew

ABN , First Publish Date - 2021-11-17T12:39:02+05:30 IST

జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు...

కొవిడ్ కేసుల పెరుగుదలతో జమ్మూలో Night curfew

శ్రీనగర్ : జమ్మూ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.జమ్మూ నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటును నిరోధించేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూ జిల్లా మెజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ హెచ్చరించారు. ‘‘జమ్మూలో పెరుగుతున్న కరోనా కేసులతో బుధవారం రాత్రి 10 నుంచి 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు గార్గ్ ట్వీట్ చేశారు. జమ్మూలో కరోనా కట్టడి కోసం ప్రజలంతా కొవిడ్ టీకాలు వేయించుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ సూచించారు. 


నైట్ కర్ఫ్యూ గురించి ప్రజల్లో ప్రచారం చేయాలని మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో కోరారు. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ జమ్మూ నగరంలో కొవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించింది. కొవిడ్ సానుకూలత రేటు 0.2 శాతం పెరిగినందున తక్షణ చర్యలు అవసరమని నిర్ణయించి నైట్ కర్ఫ్యూను విధించామని గార్గ్ వివరించారు.


Updated Date - 2021-11-17T12:39:02+05:30 IST