ఈ నెల 15 వరకు రాత్రి కర్ఫ్యూ

May 8 2021 @ 22:40PM

ఆదిలాబాద్‌టౌన్‌, మే8: కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ ఈ నెల 15 వరకు కొనసాగుతుందని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యా ప్తంగా నిర్వహించే వివాహాలు, ఇతర శుభకార్యాలకు వందమంది మాత్రమే పాల్గొనే విధంగా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారును ఆదేశించారు. విద్య, వినోదం, రాజకీయ, క్రీడలు, ప్రదర్శనలు, మత సంస్కృతి కార్యక్రమాలపై నిషేదం ఉంటుందన్నారు. రాత్రి 9 నుంచి మరునాటి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పకడ్బందీగా కొనసాగుతుందని కరోనా నిబంధనలు విధిగా పాటించాలన్నారు. షరతుల తో అనుమతించాలని అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొనరాద ని సూచించారు. అత్యవసరం తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని కోరారు. బయట సంచరిస్తున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరుచూ చేతులు శానిటేషన్‌ చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర సంస్థలను రాత్రి 8 గంటల వరకే మూసివేయాలని ఆదేశించారు. అత్య వసర సేవలైన ఆసుపత్రులు, ఔషద దుకాణాలు, డయగ్నోస్టిక్‌ ల్యాబ్‌, మీడియాకు మినహాయింపు ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌ కేంద్రాలలో రాత్రి కర్ఫ్యూ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పర్యవేక్షణలో పెట్రోలింగ్‌, గస్తీ పకడ్బంధీగా నిర్వహించాలని, మండల కేంద్రాల్లో ఎస్సైలు విధుల్లో ఉండాలన్నారు. సమావేశంలో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వీవూరి సురేష్‌, సీఐ మ ల్లేష్‌, ఎస్సై అన్వర్‌ఉల్‌హాక్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Follow Us on: