రాత్రి పొగమంచు... పగలు ఠారెత్తించిన ఎండ

ABN , First Publish Date - 2021-03-01T06:09:03+05:30 IST

జిల్లాలో పలుచోట్ల ఆదివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. మైదాన ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది.

రాత్రి పొగమంచు... పగలు ఠారెత్తించిన ఎండ
పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే మార్గంలో తీక్షణంగా కాస్తున్న ఎండ

8 ఏజెన్సీలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు


చోడవరం/ పాడేరు, ఫిబ్రవరి 28: జిల్లాలో పలుచోట్ల ఆదివారం విభిన్నమైన వాతావరణం నెలకొంది. మైదాన ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఎండ తీక్షణంగా కాసింది. కాగా శీతాకాలం ఆరంభం నుంచి మంచు, చలితో గజగజలాడిన మన్యంలో... ఆదివారం మంచు పడలేదు. పైగా ఉదయం నుంచే ఎండ మండిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతానికి దీటుగా నమోదయ్యాయి. పాడేరు మండలం మినుములూరులో 34 డిగ్రీలు, అరకులోయలో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

Updated Date - 2021-03-01T06:09:03+05:30 IST