Advertisement

కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక!

Jan 25 2021 @ 11:15AM

మెగా బ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా నిహారిక తన పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  


దాదాపు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో నిహారిక పెళ్లి సందడి అంతా ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఆ వీడియోలో ఉన్నారు. చైతన్య తాళి కడుతున్న సమయంలో నిహారిక కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.