జల సిరులు

ABN , First Publish Date - 2020-10-17T07:26:05+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుం డల్లా మారాయి. మంజీరా నదికి భారీ వరద రావడంతో

జల సిరులు

ఉమ్మడి జిల్లాలో నిండుకుండల్లా ప్రాజెక్టులు

పరవళ్లు తొక్కుతున్న గోదావరి, మంజీరా

సాలూర, కందకుర్తి వద్ద పెరిగిన వరద

ఉమ్మడి జిల్లాలో రెండు పంటలకు ఢోకా లేనట్టే!

ప్రణాళిక సిద్ధం చేస్తున్న సాగునీటి శాఖ ఉన్నతాధికారులు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌ / కామారెడ్డి)

నిజాంసాగర్‌ / మెండోర : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుం డల్లా మారాయి. మంజీరా నదికి భారీ వరద రావడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో అధి కారులు ప్రాజెక్టు గేట్లుఎత్తి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. సెప్టెంబరు మాసంలోనే నిండిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు ప్రస్తుతం మంజీరా, గోదావరి నదుల ద్వా రా మళ్లీ వరద వస్తుండంతో ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నా రు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల భారీ వర ద వస్తుండడంతో మంజీరా, గోదావరి నదులు పరవళ్లు తొ క్కుతున్నాయి. త్రివేణి సంగమం కందకుర్తి వద్ద వరద ఉధృ తి అంతకంతకూ పెరుగుతోంది. 


అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలోని చిన్న, మధ్యతర హా ప్రాజె క్టులైన రామడుగు, కళ్యాణి, సింగీతం, పోచారం, కౌలాస్‌ నాలా ప్రాజెక్టులు కూడా గత నెలలోనే నిండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎత్తిపోతల పథకాలైన గుత్ప, అలీసాగర్‌లకు కూడా నీరు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.

     

నాలుగేళ్లకు నిండిన నిజాంసాగర్‌

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత నిండింది. కర్ణా టకలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్‌కు ఎగువన మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండింది. ఆ ప్రా జెక్టు నిండడంతో నాలుగు రోజుల క్రితం గేట్లను ఎత్తి దిగు వన మంజీరాకు విడుదల చేశారు. ఆ నీరు భారీగా నిజాం సాగర్‌కు రావడంతో ప్రాజెక్టు నిండింది. ఈ సారి కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసి చెరువులు, వాగులు పొంగి ప్రవహించినా.. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద రాక వెలవెలబోయింది. ఆగస్టు నెలలో ప్రాజెక్టులోకి చుక్కనీరు రాలేదు. అయితే సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మంజీర పైభాగాన కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది. వెలవెల బోయి న నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరు కుంది. ప్రాజెక్టుకు నీటిమట్ట 15 టీఎంసీలకు చేరడంతో 14 గేట్లు ఎత్తి మంజీరాలోకి నీటిని విడుదల చేస్తున్నారు.


ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కు తోంది. నిజాంసాగర్‌ నుంచి భారీగా వరద వస్తుండంతో మొత్తం పరుచుకొని ప్రవహిస్తోంది. నెల రోజులుగా మంజీరాకు వరద రాగా.. సాగర్‌కు నీటి విడుదల మరింత పెరిగింది. దీంతో నిజాంసాగర్‌ నుంచి బీర్కూర్‌, కోటగిరి మండలాల పరిధిలో సాలూర, కందకుర్తి వరకు మంజీరా నిండుగా పా రుతోంది. సాలూరా వద్ద పాత బ్రిడ్జిని తాకుతూ వెళుతోంది. కోటగిరి మండలం పోతంగల్‌ వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. రెంజ ల్‌ మండలం కందకుర్తి వద్ద సైతం భారీగా పారుతోంది. రెండు నదుల ద్వారా వరద రావడంతో త్రివేణి సంగమం అయిన కందకుర్తి వద్ద ప్రవాహం అంతకంతకూ పెరుగు తోంది. ఈ వరద నేరుగా శ్రీరామసాగర్‌కు వచ్చి చేరుతోంది.  ఎస్సారెస్పీకి శుక్రవారం సాయంత్రం వరకు లక్షా 13 వేల 901క్యూసెక్కుల వరద రాగా.. అధికారులు 16 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. 

  

ఈయేడు ఎస్సారెస్పీకి భారీ వరద

ఈ సంవత్సరం శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. నేటికీ కొనసాగుతూనే ఉంది. జూన్‌ మాసం నుం చి ఇప్పటి వరకు 300టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చిం ది. ప్రాజెక్టు నుంచి నెల రోజులుగా సుమారు 180 టీఎంసీల కు పైగా నీటిని గోదావరిలోకి వదిలారు. మరో 20 టీఎంసీల వరకు వరద కాలువ ద్వారా మిడ్‌ మానేరుకు తరలించారు. మహారాష్ట్రలో గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండడం తో వరద నిరంతరాయంగా వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ఠ నీటి మట్టం ఉంచుతూనే మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.


ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సాగునీటి శాఖ

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు నిండ డంతో యాసంగి పంటల కోసం వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారులు ఆయకట్టు ప్రణా ళికను సిద్ధం చేస్తున్నారు. ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాల కింద సాగుకు నీటి ని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎంత మొత్తం సా గవుతుందో వివరాలు తీస్తున్నారు. శ్రీరాంసాగర్‌, నిజాంసాగ ర్‌ పరిధిలోని ఆయకట్టుపై ఈనెల చివరలో జరిగే శివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. నిజాంసాగ ర్‌, రామడుగు, పోచారం, కౌలాస్‌నాలా, సింగీతం, కళ్యాణి, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల కింది ఉమ్మడి జిల్లా నీటి పా రుదల బోర్డు సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించి ఆయకట్టును ఖరారు చేస్తారు. బోర్డు నిర్ణయాలను శివం కమిటీకి పంపి స్తారు. ఈ నెలలోనే ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉండడంతో ఉమ్మడి జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నారు. నిజాంసాగర్‌ పరిఽ దిలో 2 లక్షల 8 వేల ఎకరాల వరకు ఈ యాసంగిలో సాగునీరు అందనుంది. గు త్ప, అలీసాగర్‌ లిప్టులలో నీళ్లు అందు బాటులో ఉండడం వల్ల మరింత పెరగ నుంది. ఉమ్మడి జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న నీటి నిలువలకు అనుగుణంగా అధికా రులు ప్ర ణాళికలు రూపొందిస్తున్నారు.


శ్రీరాంసాగర్‌ 

పరిధిలో లక్ష్మీకాలువ, గుత్ప, అలీసాగర్‌ల ద్వారా సాగునీరు అందుతోంది. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం ఐదు న్నర లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుందని అధి కారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆయకట్టు పరిధిలో మొ త్తం వరి సాగవుతుందని వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. గత ఏడాదితో పోల్చితే ఈ యాసంగిలో ఆయకట్టు భారీగా పెరు గుతుందని తెలిపారు. ప్రస్తుత నీటి వనరులతో వానాకా లం పంటలకు కూడా సాగునీటికి ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-17T07:26:05+05:30 IST