Nikhil: హోటల్ కాస్టల్ ఓపెనింగ్‌లో మోడల్స్‌తో సందడి

Published: Mon, 08 Aug 2022 16:31:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Nikhil: హోటల్ కాస్టల్ ఓపెనింగ్‌లో మోడల్స్‌తో సందడి

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఆగస్ట్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం నిఖిల్ చిత్ర ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్, మణికొండలోని కె‌ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కి చెందిన హోటల్ కాస్టల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీతారలు, మోడల్స్ సందడి చేశారు. ప్రారంభోత్సవ అనంతరం నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లోని లగ్జరీ హోటల్స్‌లో ‘హోటల్ కాస్టల్’ (Hotel Castle) కూడా ఒకటి. ఇక్కడ లగ్జరీ రూమ్‌లతో పాటుగా ఆటోమేటెడ్ టాయ్‌లెట్స్, వైరస్‌ను చంపే లైట్స్, 24 గంటలు సప్లయ్ చేసే ఫుడ్, అత్యాధునికమైన డిజైన్ అండ్ అందరికీ అందుబాటు ధరల్లో హైదరాబాద్‌లో ఎక్కడ లేని విధంగా వసతులు ఉంటాయి. హైదరాబాద్‌కి  రోజూ ఎంతో మంది టూరిస్ట్‌లు వస్తున్నారు.. అలాంటి  సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుకి మరియు ఎయిర్ పోర్ట్‌కి దగ్గరగా ఇలాంటి ఆధునికమైన హోటల్స్ అవసరం చాలా ఉంది. స్నేహితుల దినోత్సవం రోజున నాకెంతో సన్నిహితుడైన స్నేహితుడు చంద్ర స్థాపించిన ఈ హోటల్‌ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే నేను నటించిన ‘కార్తికేయ2’ చిత్రం ఈ నెల 13న రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను..’’ అన్నారు. 


కె ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఛైర్మన్ చంద్ర గుప్తా (Chandra Gupta) మాట్లాడుతూ.. ‘‘హోటల్ కాస్టల్ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో నిఖిల్, బుల్లితెర హీరోయిన్ శిరీష, మోడల్స్ స్పందన, మౌనిక ఇంకా ఇతరులకు నా కృతజ్ఞతల. ఈ హోటల్‌లో కొత్త టెక్నాలజీతో వాయిస్ ఆపరేటెడ్ ఎక్విప్‌మెంట్, ఫైర్ సేఫ్టీ మరియు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అయిన చెఫ్ భరత్ వర్మతో 24 గంటల ఫుడ్ సర్వీస్ అందిస్తున్నాము. ఈ హోటల్స్ ఇప్పటికే విజయవాడలోని గన్నవరం, షిరిడీలో ఉన్నాయి. త్వరలో మరో హోటల్ అందుబాటులోకి రానుంది..’’ అని తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International